మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ నెలలో ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, జగ్జీవన్‌రామ్ జయంతి, బిహు లాంటి పండుగలు ఉన్నాయి. దాదాపు 15 రోజులపాటు ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. అయితే ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులలో కొంత మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 1(New Rules From April 1)న బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ కనుక ఆ రోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. నెల తొలి రోజు నుంచే ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని గమనించి తమ పనులు ప్లాన్ చేసుకోవాలి.


Also Read; ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం


ఏప్రిల్ 2021లో బ్యాంకు సెలవు దినాలు ఇవే:
- ఏప్రిల్ 1 - గత ఏడాది అకౌంట్ క్లోజింగ్
- ఏప్రిల్ 2 - గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 4 - ఆదివారం
- ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
- ఏప్రిల్ 10 - రెండో శనివారం
- ఏప్రిల్ 11 - ఆదివారం 
- ఏప్రిల్ 13 - తెలుగు సంవత్సరాది, ఉగాది పండుగ
- ఏప్రిల్ 14 - బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి/ తమిళ  సంవత్సరాది/ బీజు పండుగ
- ఏప్రిల్ 15 - హిమాచల్ డే/ బెంగాలీ నూతన సంవత్సరాది/ బోహగ్ బిహూ / సార్హుల్
- ఏప్రిల్ 16 - బోగాహ్ బిహూ
- ఏప్రిల్ 18 - ఆదివారం
- ఏప్రిల్ 21 - శ్రీరామనవమి  / గరియా పూజ
- ఏప్రిల్ 24 - నాలుగో శనివారం
- ఏప్రిల్ 25 - ఆదివారం


Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook