Bank Holiday in July 2023: జూలై నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో కలిపి జూలై నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. త్రిపుర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోని బ్యాంకులు మొహర్రం పర్వదినం సందర్భంగా సెలవు ఉండనుంది. గురు హరగోవింద్ సింగ్ జన్మదినోత్సవం, అషురా, కేర్ పూజ వంటి పండుగలకు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీ డే వచ్చింది.  8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగల కోసం ఆర్‌బీఐ సెలవు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే నెలలో బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఏటీఎం, క్యాష్ డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పనులను ఇంటి వద్ద నుంచి కూడా చేసుకోచ్చు. అయితే రూ.2 వేల నోటును బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని అనుకునేవారు సెలవుల జాబితాను చెక్ చేసుకుని వెళ్లడం బెటర్. రూ.2000 నోటును మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే.


జూలై 2023లో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..


==> జూలై 2:  ఆదివారం
==> జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే
==> జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే సందర్భంగా మిజోరాం రాష్ట్రంలో సెలవు
==> జూలై 8: రెండో శనివారం కారణంగా హాలీ డే
==> జూలై 9: ఆదివారం
==> జూలై 11: కేర్ పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులు బంద్
==> జూలై 13: భాను జయంతికి సిక్కింలో బ్యాంకులు క్లోజ్ 
==> జూలై 16: ఆదివారం
==> జూలై 17: యు టిరోట్ సింగ్ డే- మేఘాలయలో బ్యాంకులకు సెలవు 
==> జూలై 22: నాలుగో శనివారం
==> జూలై 23: ఆదివారం
==> జూలై 28: అషూరా -జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు హాలీ డే
==> జూలై 29: మొహర్రం (దాదాపు అన్ని రాష్ట్రాల్లో)
==> జూలై 30: ఆదివారం
==> జూలై 31: అమరవీరుల దినోత్సవం సందర్భంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సెలవు. 


Also Read: Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం   


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook