Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?
Bank Holidays In July: లావాదేవీల కోసం బ్యాంకుల వినియోగం తప్పనిసరిగా మారింది. గతంలో మాదిరి నగదు లావాదేవీలు లేకపోవడంతో అంతా ఆన్‌లైన్ వ్యవహారాలు నడుస్తున్నాయి. దీంతో బ్యాంకుల సేవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్యాంకు సేవల కోసం వినియోగదారులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఎంత ఆన్‌లైన్ సేవలు వచ్చినా కూడా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల సెలవులు ముందే తెలుసుకుంటే ఆ రోజు సులువుగా పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే సెలవు ఉన్న రోజే బ్యాంకుకు వెళ్తే నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి జూలై నెలలో ఎన్ని రోజులో తెలుసుకోండి.
Also Read: Jio Hikes Tariff: కస్టమర్లకు జియో భారీ షాక్.. ఊహించని రీతిలో అన్నీ రేట్లు భారీగా పెరుగుదల
గతంలో బ్యాంకు ఉద్యోగమంటే తక్కువ పని ఉంటుండే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు అధికారికంగానే దాదాపు 9 నుంచి 10 గంటల వరకు పని చేస్తున్నారు. పని ఒత్తిడితో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉపశమనం ఇచ్చేవి సెలవులు. ఈ సెలవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారు జూలై నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. జూలై నెలలో మొత్తం 11 రోజులు సెలువులు ఉన్నాయి. అవి ఇవే..
Also Read: ITR Filing Benefits: ఐటీ రిటర్న్స్‌తో 5 కీలకమైన ప్రయోజనాలు ఇవే
జూలై 3 బుధవారం: బెహ్ డైన్ ఖ్లామ్ సందర్భంగా సెలవు. అయితే కేవలం మేఘాలయలో మాత్రమే.
జూలై 6 శనివారం: ఎంహెచ్‌ఐపీ డే సందర్భంగా మిజోరంలో సెలవు.
జూలై 7 ఆదివారం: వారాంతపు సెలవు
జూలై 8 సోమవారం: కాంగ్ రథ జాతర సందర్భంగా మణిపూర్‌లో సెలవు.
జూలై 9 మంగళవారం: దృక్పా షేజీ సందర్భంగా సిక్కింలో సెలవు.
జూలై 13 రెండో శనివారం: వారాంతపు సెలవు
జూలై 14 ఆదివారం: వారాంతపు సెలవు
జూలై 17 బుధవారం: మొహర్రం. భారతదేశమంతటా అన్ని బ్యాంకులకు సెలవు.
జూలై 21 ఆదివారం: వారాంతపు సెలవు
జూలై 27 నాలుగో శనివారం: వారాంతపు సెలవు
జూలై 28 ఆదివారం: వారాంతపు సెలవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి