Bank Holidays June 2023: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెల సెలవుల్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి జూన్‌లో 12 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఒకవేళ జూన్‌లో మీకు బ్యాంకు సంబంధిత పనులుంటే ఇబ్బంది తలెత్తకుండా సెలవులు ఎప్పుడున్నాయో చెక్ చేసుకుని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే నెల ముగిసేందుకు మరి కొద్దిరోజులే మిగిలింది. 31రోజుల ఈ నెలలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన జూన్ నెల హాలిడేస్ లిస్ట్ ప్రకారం 12 రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరం రెండవ నెల ముగియనుంది. జూన్‌లో బ్యాంకు పనులుంటే సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. జూన్ నెలలో ఏకంగా 12 రోజుల బ్యాంకులకు సెలవులుండటంతో ఆ ప్రభావం బ్యాంకు సంబంధిత పనులపై పడనుంది. బ్యాంకు సంబంధిత కొన్ని పనులు పూర్తి చేయాలంటే అన్నీ ఆన్‌లైన్‌లో సాధ్యం కావు. కొన్నింటికి బ్యాంకుకు వెళ్లాల్సిందే. 


మీక్కూడా జూన్ నెలలో బ్యాంకు పనులేమైనా ఉంటే ఆర్బీఐ విడుదల చేసిన జూన్ హాలిడేస్ లిస్ట్ ఓసారి చెక్ చేసుకుంటే మంచిది. ఈ జాబితా ప్రకారం జూన్‌లో మొత్తం 12 రోజులు సెలవుంది. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలున్నాయి. జూన్ బ్యాంక్ సెలవులు జాబితా ఇలా ఉంది..


జూన్ 2023 బ్యాంకు సెలవుల జాబితా


4 జూన్ ఆదివారం సెలవు
10 జూన్ రెండవ శనివారం సెలవు
11 జూన్ ఆదివారం సెలవు
15 జూన్ రాజ సంక్రాంతి, మిజోరాం, ఒడిశాలో సెలవు
18 జూన్ ఆదివారం సెలవు
20 జూన్ రథయాత్ర, ఒడిశా, మణిపూర్ లో సెలవు
24 జూన్ నాలుగవ శనివారం సెలవు
25 జూన్ ఆదివారం సెలవు
26 జూన్ త్రిపురలో సెలవు
28 జూన్ ఈదుల్ అజ్హా, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, కేరళలో సెలవు
29 జూన్ బక్రీద్ సెలవు
30 జూన్ రీమా ఈదుల్ అజ్హా సెలవు


బ్యాంకులకు సెలవులున్నా సరే కొన్ని రకాల పనులు ఆన్‌లైన్ విధానంలో పూర్తి చేసుకోవచ్చు. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలపై బ్యాంకు సెలవుల ప్రభావం పడదు. ఆన్‌లైన్‌లో పూర్తి కాగల పనులపై ఏ ప్రభావం ఉండదు.


Also read: WhatsApp Links Scams: వాట్సాప్‌లో లింక్.. క్లిక్ చేయగానే 17 లక్షలు హాంఫట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook