Bank Holidays In March 2023: బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. ఈ నెలలో బ్యాంకుకు సంబంధించిన మీకు ఏదైనా పని ఉంటే.. త్వరగా పూర్తి చేసుకోండి. మార్చిలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో అనేక బ్యాంకింగ్ సంబంధిత సేవలపై ప్రభావం పడనుంది. మార్చి నెల బ్యాంకింగ్‌కు చాలా ముఖ్యమైన నెల. ఇది ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కావడంతో అధికారులు అంతా బిజీ బిజీగా ఉంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై మరింత ఒత్తిడి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెలలో 10 సెలవుల రాగా.. వచ్చ నెలలో హోలీలో కలుపుకుని మొత్తం 12 రోజులు సెలవులు రానున్నాయి. ఇందులో రెండో, నాలుగో శని, ఆదివారాల సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్చి నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. మార్చి 7, 8వ తేదీలలో హోలీ పండుగ ఉంది. దీంతో రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఆదివారాలు మార్చి 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు, మార్చి 11, 25వ తేదీల్లో రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి. 


అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో వివిధ పండుగల సందర్భంగా మార్చి 22న బాంకులకు హాలీ డే ప్రకటించారు. రామ నవమి సందర్భంగా మార్చి 30న కొన్ని చోట్ల బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 9న పాట్నాలో 9 రెండవ రోజు హోలీ సెలవు ఉంటుంది. మార్చి 3న చాప్చార్ కుత్ ఫెస్టివల్ సందర్భంగా మిజోరాంలో బ్యాంకులకు హాలీ డే ప్రకటించారు. దీంతో మార్చి నెలల మొత్తం 12 రోజులకు బ్యాంకులకు హాలీ డే ఉంటుంది. 


బ్యాంకులకు సెలవులు ఉన్నా.. ఆన్‌లైన్ లావాదేవీలు కొనసాగునున్నాయి. యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సేవలు కొనసాగుతాయి. అయితే చెక్‌బుక్, పాస్‌బుక్ సేవలపై ప్రభావం పడనుంది. మీకు బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన తేదీ ఉంటే.. ఆయా సెలవు రోజులు గుర్తుపెట్టుకోండి. ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేయడంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని బ్యాంకులు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 


Also Read: Tamilisai Soundararajan: కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై.. ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ కామెంట్  


Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి