Bank Holidays in May 2023: రోజావారీ జీవితంలో బ్యాంక్ పని ఓ భాగమైపోయింది. ఆర్ధిక లావాదేవీలు జరిపేందుకో మరో పని మీదనో బ్యాంకుకు వెళ్లడం తప్పనిసరిగా మారింది. అయితే వెళ్లే ముంందు ఏయే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నెలా బ్యాంకుల సెలవుల్ని ప్రకటించే ఆర్బీఐ మే నెల బ్యాంకు సెలవుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో సెలవుంటే మరికొన్ని రాష్ట్రాల్లో పనిదినంగా ఉంటుంది. మే నెలలో దేశంలోని వివిధ బ్యాంకులు 12 రోజులపాటు పనిచేయవని ఆర్బీఐ తెలిపింది. ఈ 12 రోజుల్లో 4 ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి. అంటే ఆరు రోజులు శని, ఆదివారాలు సెలవులుంటే మరో 6 రోజులు ఇతర సెలవులున్నాయి.


మే 7  ఆదివారం
మే 13 రెండవ శనివారం
మే 14 ఆదివారం
మే 21 ఆదివారం
మే 27 నాలుగవ శనివారం
మే 28 ఆదివారం


ఇక ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అస్సోం, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులకు మే 1వ తేదీ మేడే సెలవుంది. ఇక మే 2వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక సందర్భంగా సెలవుంది. ఇక మే 5వ తేదీన బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఘండ్ రాష్ట్రాల్లో సెలవుంది. ఇక మే 9వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లో సెలవుంది. మే 16న సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా, మే 22న మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో, మే 24న కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి పురస్కరించుకుని త్రిపురలో బ్యాంకులకు సెలవులున్నాయి.


Also read: Gas Cylinder Prices: గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన గ్యాస్ ధర, ఇవాళ్టి నుంచి అమలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook