Bank Holidays: దేశవ్యాప్తంగా బ్యాంకులకు ప్రతి నెలా ఉండే సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంటుంది. ఈ సెలవుల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులతో పాటు వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. ప్రాంతీయ సెలవులైతే రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు దీపావళి పురస్కరించుకుని వరుసగా ఐదురోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నా బ్యాంకుకు వెళ్లి చూసుకోవల్సి పనులు మాత్రం ఎప్పటికే ఉండనే ఉంటుంటాయి. అందుకే బ్యాంకులకు సెలవులుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ప్రతి నెలా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో ముందే చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి పండుగ సెలవులకు, వీకెండ్స్ కలిసొస్తే వరుసగా సెలవులు పెరిగిపోతాయి. ఈసారి నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువే ఉన్నాయి. నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకూ వరుసగా ఐదురోజులు సెలవులున్నాయి. ఏయే రోజుల్లో ఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులున్నాయో తెలుసుకుందాం.


నవంబర్ 11 రెండవ శనివారం సెలవు
నవంబర్ 12 ఆదివారం సెలవుతో పాటు దీపావళి సెలవు
నవంబర్ 13 త్రిపుర, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, యూపీల్లో గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ సెలవు
నవంబర్ 14 గుజరాత్ , మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింతో పాటు కొన్ని రాష్ట్రాల్లో సంపత్, లక్ష్మీ పూజ సెలవు
నవంబర్ 15 సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భాయ్‌దూజ్, లక్ష్మీపూజ సెలవు


అంంటే దాదాపు చాలా రాష్ట్రాల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకూ వరుసగా ఐదురోజులు బ్యాంకు సెలవులున్నాయి. నిత్యం బ్యాంకు పనులుండేవాళ్లు ఈసెలవుల్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే సెలవు దినాల్లో ఏటీఎం సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. 


Also read: Ind vs Nz: నాకౌట్ మ్యాచ్‌లో ఇండియా బలమెంత, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా పైచేయి ఎవరిది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook