Bank offers Punjab National Bank give 2 lakh rupees benefits to customers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటే రూ.2 లక్షల వరకు బీమా పొందొచ్చు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వాళ్లందరికీ ఈ ఆఫర్ వర్తించదు. కేవలం జన్ ధన్ ఖాతాలు ఉన్న ఖాతాదారులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో (Punjab National Bank‌) జన్ ధన్ ఖాతాలు (Jan Dhan account) ఉన్న వారికి బీమాతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తోంది పీఎన్‌బీ. మరి ఆ సౌకర్యాలు ఏమిటో ఒకసారి చూద్దాం.. 


2 లక్షల దాకా ప్రయోజనం


పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన జన్ ధన్ ఖాతాదారులకు.. PNB రూపే జన్‌ధన్ కార్డ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక రూపే కార్డ్‌ ను రెగ్యులర్ ఏటీఏం కార్డ్‌లా వినియోగించుకోవచ్చు. ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి... అలాగే ఆన్‌లైన్ కోనుగోళ్లకు తదితర వాటికి ఉపయోగించుకోవచ్చు. 


Also Read : Shocking video: వామ్మో.. రెండు తలల పాము.. రెండు ఎలుకలను ఒకేసారి ఎలా మింగేస్తుందో చూడండి 


330 ప్రీమియంతో 2 లక్షల బీమా


ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) వార్షిక ప్రీమియం రూ. 330 ప్లాన్ కింద వినియోగదారులకు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ (Life Insurance) లభిస్తుంది. ఈ మొత్తం మీ బ్యాంక్ ఖాతా నుండి ECS ద్వారా తీసుకుంటారు. ఈ ప్లాన్ కింద.. కస్టమర్లకు 2 లక్షల లైఫ్ కవర్ లభిస్తుంది.


ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన


ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కూడా.. చాలా తక్కువ ప్రీమియంతో జీవిత బీమాను అందిస్తుంది. PMSBY కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్. ఈ స్కీమ్ (Scheme) కింద ఖాతాదారుడు కేవలం రూ. 12కే రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీని (Life Insurance) పొందొచ్చు.


Also Read : Diego Maradona Watch:మారడోనా లగ్జరీ వాచీ-దుబాయిలో చోరీ-ఇండియాలో దొరికింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook