EPFO : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా

EPF account holders get Rs 7 lakh cover under EDLI scheme :  మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే రూ.7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కల్పించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు ల‌క్ష‌ల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్‌ లింక్డ్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ కింద ఈ సౌక‌ర్యం కల్పించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 02:04 PM IST
  • ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు ల‌క్ష‌ల రూపాయల ఉచిత బీమా సౌకర్యం
  • ఎంప్లాయిస్ డిపాజిట్‌ లింక్డ్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ ద్వారా మెంబర్స్‌ కోసం స్కీమ్
  • నామినీలకు 7 లక్షల రూపాయలు చెల్లించనున్న ఈడీఎల్‌ఐ
EPFO : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా

EPFO EDLI Alert epfo members should file enomination and get 7 lakh rupees benefits : మీరు ఉద్యోగం చేస్తున్నారా.. మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే రూ.7 లక్షల రూపాయల ప్రయోజనాన్ని పొందే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) (Employees' Provident Fund Organisation) (EPFO) కల్పించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా ఏడు ల‌క్ష‌ల రూపాయల ఉచిత బీమా సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పిస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్‌ లింక్డ్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ కింద ఈ సౌక‌ర్యం కల్పించింది. 

ఉద్యోగి ఒక‌వేళ విధులు నిర్వహిస్తూ మరణిస్తే.. నామినీలకు 7 లక్షల రూపాయలు ( Rs 7 lakh) చెల్లిస్తారు. ఇందుకోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పీఎఫ్​ ఖాతా ఉన్న ఉద్యోగులంతా ఈ పథకానికి అర్హులు. 

ఈఎల్‌డీఐ 1976 (Employees’ Deposit Linked Insurance Scheme, 1976) నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ మెంబర్ నామినీలు కనిష్టంగా రూ. రెండున్నర లక్షల నుంచి.. గరిష్టంగా 7 లక్షల రూపాయల దాకా బీమా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ మెంబర్ మ‌ర‌ణానికి ముందు పన్నెండు నెల‌లుగా తీసుకున్న జీతం ఆధారంగా ఈ బీమా కవరేజీ ఉంటుంది. ఉద్యోగంలో ఉండగానే ఎవరైనా ఈపీఎఫ్‌ఓ మెంబర్ మరణిస్తే ఈ ఉచిత బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంటుంది. గతంలో ఇది ఆరు ల‌క్ష‌ల రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని 7 లక్షల రూపాయలకు పెంచారు. 

పీఎఫ్‌, ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈ జీవిత బీమా రావడం కోసం.. మెంబర్ యాజ‌మాన్యం ప్రతి నెల మెంబర్ జీతాన్ని బట్టీ 0.50 శాతాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈడీఎల్‌ఐకీ  (EDLI) మెంబర్ యాజ‌మాన్యాలే ఈ వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేత‌నం నుంచి మినాయించవు.దీంతో పీఎఫ్‌, ఈపీఎఫ్ మెంబర్లు ఈడీఎల్ఐ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌లో ఆటోమేటిక్‌గానే న‌మోద‌వుతారు. ఉద్యోగంలో ఉండగా మెంబర్ మరణిస్తే.. నామినీలకు బీమా డబ్బు అందుతుంది. 

Also Read : Scary Video:భయానికే భయం పుట్టించే వీడియో..20 అడుగుల పాము చిన్న పాప వైపు..ఏం జరిగింది..?

ఎంప్లాయీస్ డిపాజిట్‌లింక్డ్‌ ఇన్సూరెన్స్ పథకం (‘Employees’ Deposit Linked Insurance’) (EDLI) ప్రయోజనాలు పొందాలంటే.. కచ్చితంగా ఇ- నామినేషన్‌ మొదట ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇది వరకే  ఇ- నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. చేయకపోతే మాత్రం.. నామినీ వివరాలను ఈపీఎఫ్ ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్‌లో నామినీ వివరాలు ఎంట్రీ చేయడం చాలా సులువే. 

పీఎఫ్ మెంబర్స్.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సైట్‌లో  ఇ- నామినేషన్‌ పూర్తి చేయొచ్చు. అయితే మీ యూఎఎన్‌ నంబర్‌‌కు ఆధార్ అనుసంధానమై ఉండాలి. ఇక ఆధార్‌‌కు లింక్ అయిన మొబైల్‌ నంబర్ కూడా పని చేస్తూ ఉండాలి. తర్వాత సులువుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో ఇ- నామినేషన్‌ పూర్తి చేయొచ్చు. 

ఈ విధంగా ఇ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి... 
1. మీరు ముందుగా EPFO ​​అధికారిక వెబ్‌సైట్ https://www.epfindia.gov.in/ ని ఓపెన్ చెయ్యండి. 
2. అక్కడ 'సర్వీసెస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 
3. తర్వాత 'ఎంప్లాయీస్' పై క్లిక్ చేయండి. 
4. ఇప్పుడు 'మెంబర్ UAN/ఆన్‌లైన్ సర్వీస్ (OCS/OTCP)'పై క్లిక్ చేయండి.
5. తర్వాత UAN, పాస్‌వర్డ్‌ని ఎంట్రీ చేసి లాగిన్ అవ్వండి.
6. దీని తర్వాత 'మేనేజ్' ట్యాబ్‌లో 'ఇ-నామినేషన్' ను ఎంచుకోండి.
7. ఆ తర్వాత స్క్రీన్‌పై 'వివరాలను అందించండి' ట్యాబ్ కనిపిస్తుంది, 'సేవ్'పై క్లిక్ చేయండి.
8. ఫ్యామిలీ డిక్లరేషన్‌ను అప్‌డేట్ చేయడానికి 'ఎస్‌' ఆప్షన్‌ పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు 'Add Family Details' పై క్లిక్ చేయండి. నామినీగా ఒకరు లేదా ఎక్కువ మంది పేర్లు ఇచ్చుకోవచ్చు. 
10. ఏ నామినీకి ఎంత వాటా ఇవ్వాలో కూడా తెలపవచ్చు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత 'సేవ్' పై క్లిక్ చేయండి.
11. తర్వాత 'ఈపీఎఫ్ నామినేషన్'పై క్లిక్ చేయండి.
12. తర్వాత OTP కోసం 'e-Sign'పై క్లిక్ చేయండి. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
13. OTPని ఎంటర్ చేసిన తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేయండి. దీంతో ఇ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Also Read : Telangana MLC Polls: నేడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు-ప్రారంభమైన పోలింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News