బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించారు. కొన్ని బ్యాంకుల్ని ప్రైవేట్‌పరం చేస్తుంటే..ఇంకొన్ని బ్యాంకుల్లో వాటాలు విక్రయించనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకై ప్రాధమిక టెండర్లు దాఖలు చేసేందుకు గడువు తేదీని జనవరి 7 వరకూ పెంచింది. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ప్రభుత్వం, ఎల్ఐసీ విక్రయించనున్నాయి. దీనికోసం ఐడీబీఐ బ్యాంకు ఆసక్తి కలిగిన విక్రేతల్నించి అక్టోబర్ నెలలో టెండర్లు ఆహ్వానించారు. దీనికి గడువు తేదీ డిసెంబర్ 16 గా ఉండేది. ఇప్పుడా తేదీని జనవరి 7 వరకూ పెంచింది కేంద్ర ప్రభుత్వం.


గడువు తేదీ పొడిగింపు విషయంలో వచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రకారం ఈవోఎల్ సమర్పించేందుకు చివరి తేదీ ఇప్పుడు జనవరి 7. మరోవైపు ఈవోఎల్ కాపీలు సమర్పించే గడువు తేదీ కూడా డిసెంబర్ 23 నుంచి జనవరి 14 వరకూ పొడిగించారు. 


ఐడీబీఐ కొనుగోలుకు రేసులో ఉన్నదెవరు


ఈ బ్యాంకు కొనుగోలు చేసేందుకు కళాయిల్ గ్రూప్, ఫేర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, డీసీబీ బ్యాంకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ వార్తల నేపధ్యంలో ఇవాళ బ్యాంకు షేర్లలో పెరుగుదల కన్పించింది. ఐడీబీఐ బ్యాంకులో పది శాతం వాటా కోసం టెండర్లు దాఖలు చేయనున్నారు. 


Also read: Railway Facts: ప్రపంచమంతా దూసుకుపోతున్నా..ఇప్పటికీ రైలు లేని 5 దేశాలివే, కారణమేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook