Bank Strike Today: ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో రెండు రోజులపాటు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం (మార్చి 15) మరియు మంగళవారం (మార్చి 16) ప్రభావితం కానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBC) ఇటీవల పిలుపునిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమ్మె వల్ల బ్యాంకులలో డిపాజిట్లు మరియు విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్ మరియు లోన్ అప్రూవల్స్ సహా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి. అదే సమయంలో ఖాతాదారులకు ఏటీఎంలు సేవలు అందించనున్నాయి. నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మె(Bank Strike)లో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫొరం తెలిపింది. మార్చి 4, 9, 19 తేదీల్లో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె బాట పట్టారు. బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనున్నట్లు ప్రకటించారు. 


Also Read: Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India), కెనరా బ్యాంక్ మరియు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే తమ వినియోగదారులకు దేశవ్యాప్త సమ్మె కారణంగా సాధారణ పని ప్రభావితం కావచ్చని ప్రకటనలో తెలిపాయి. కాగా, ప్రైవేటు బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ బ్యాంకులు యథాతథంగా విధులు నిర్వహిస్తున్నాయి.


Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తున్నారు


సోమవారం నుండి రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBC) తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సంస్థ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC) మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్లు (NOBO), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW) ఈ సమ్మెలో పాల్గొంటారు.


Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తున్నారు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook