Google Search: గూగుల్‌లో ఈ విషయాలు అసలు సెర్చ్ చేయవద్దు, లేదంటే బ్యాంక్ ఖాతా ఖాళీ

Dont Search These Things On Google | స్మార్ట్‌ఫోన్ యూజర్లు అధికంగా గూగుల్ సెర్చింజన్‌పై ఆధార పడుతున్నారు. వారికి ఏ విషయం తెలియకున్నా, ఏమైనా చేయాలన్నా గూగుల్‌లో దాని గురించి సెర్చ్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఇది మీకు మేలు చేస్తుంది. కానీ దాంతోపాటు సైబర్ నేరగాళ్లు సైతం గూగుల్‌లో తమ క్రియేటివిటీని సైబర్ మోసాలకు ఉపయోగిస్తారని సైతం గుర్తుంచుకోవాలి.

1 /6

Google Search | ఏదైనా విషయం తెలుసుకోవాలంటే వెంటనే మొబైల్ లేదా కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతరత్రా డివైజ్‌లలో Googleను ఆశ్రయిస్తున్నాం. అయితే కొన్ని విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయడం వల్ల మన బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏదైనా వస్తువు, విషయం గురించి తెలుసుకోవడానికి సులభమైన సాధనం గూగుల్ సెర్చ్. అయితే సైబర్ నిపుణులు కొన్ని విషయాలు మాత్రం గూగుల్‌లో సెర్చ్ చేయవద్దని నెటిజన్లకు సూచిస్తున్నారు. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు, Silver Price

2 /6

చాలా మంది ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తుంటారు. అయితే వీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తుంటారు. కానీ అదే సమయంలో సైబర్ నేరస్తులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఉండవచ్చు. కనుక మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయకుండా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడ నుంచి ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో సైబర్ నేరగాళ్లు మనం ఉపయోగించే నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా మీ బ్యాంకింగ్ వివరాలను దొంగిలించవచ్చు. దాంతో ఖాతాలోని నగదు మాయం చేస్తారు. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేస్తున్నారు

3 /6

కొన్ని పర్యాయాలు సేవల కోసం మనం కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్‌లో సెర్చ్ (Google Search) చేస్తుంటాం. అయితే ఎల్లప్పుడూ ఇది మంచిది కాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు తప్పుడు కస్టమర్ కేర్ నెంబర్‌ను కోడ్ చేసి ఉండవచ్చు. అది నిజమనుకుని ఆ నెంబర్లకు మీరు కాల్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, మీ ఫోన్ డేటా, బ్యాంకు వివరాలును వారు డౌన్‌లోడ్ చేసుకుని, లేదా సేకరించి సైబర్ నేరాలకు పాల్పడతారు.

4 /6

మొబైల్ యాప్స్ విపరీతంగా డౌన్‌లోడ్ చేస్తున్నారా. అయితే మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో ఉన్నట్లేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ లేదా కంప్యూటర్, ట్యాబ్‌లలో ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మీరు గూగుల్ సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసే యాప్స్‌ను సైబర్ క్రైమినల్స్ కూడా తయారు చేసి ఉండవచ్చు. అందుకే ప్లే స్టోర్‌లో కనిపించే యాప్స్ నిర్ధారించుకోకుండా డౌన్‌లోడ్ చేయకూడదు. లేకపోతే మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తాయి. Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

5 /6

ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్ట్ గురించి సమాచారం కావాలంటే గూగుల్ సెర్చ్‌లో చెక్ చేయవద్దు. అధికారిక వెబ్‌సైట్ నిర్ధారించుకుని ఆ సైట్ ద్వారా మీకు కావాలసిన సమాచారం పొందాలి. ఆన్‌లైన్ పేమెంట్స్, ఉద్యోగాల దరఖాస్తులకు సైతం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఫీజు చెల్లించాలి. లేక సైబర్ మోసానికి గురవుతాము. Also Read: Whatsapp new feature: వాట్సప్ కొత్త ఫీచర్ త్వరలో ఇండియాలో కూడా, ఇక చాటింగ్‌ను మరింత ఎంజాయ్ చేయవచ్చు

6 /6

ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్నిసార్లు కూపర్లు, ఆఫర్లు అంటూ కస్టమర్లను ఆకర్షిస్తారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. నకిలీ కూపన్ కోడ్ స్కాన్ చేయడం, వివరాలు సమర్పించగానే మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్లు సేకరిస్తారు. దాని వల్ల బ్యాంక్ ఖాతాలో నగదు మొత్తం కోల్పోవచ్చు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.  Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook