March 2022 Bank Holidays: మార్చి నెలలో ఇప్పటి 12 రోజులు మగిశాయి. నేడు ఆదివారం (మార్చి 13). ఈ నెలలో బ్యాంకులు మొత్తం 13 సెలవులు ఉండగా.. అందులో 6 సెలవులు (నేటితో కలిపి) ముగిశాయి. ఈ నెలలో ఇంకా 18 రోజులు మిగిలి ఉన్నాయి. 18 రోజుల్లో బ్యాంకులు 7 రోజులు సెలవులో ఉండనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను బ్యాంకులకు ఈ సెలవులు వర్తించవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాంతీయ పండుగల సహా ఇతర ప్రత్యేక దినాలనుబట్టి సెలవులు నిర్ణయమై ఉంటాయి.


ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లకుండానే చాలా పనులు పూర్తవుతున్నా.. కొన్ని సార్లు కచ్చితంగా బ్యాంక్​కు వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి పనులేవైనా ఉంటే.. ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇందుకోసం బ్యాంకుల సెలవులు ఎప్పుడు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు బ్యాంకులు ఉన్నాయి? ఎక్కడ బ్యాంకులు సెలవులో ఉంటాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


మార్చి చివరి రెండు వారాళ్లో సెలవులు ఇలా..


  • మార్చి 17: హోలికా దహన్​- ఉత్తర్​ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి.

  • మార్చి 18: హోలీ- దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్ల నేడు సెలవు ఉంటుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు ఇప్పటికే సెలవు తేదీని ప్రకటిచినట్లు తెలిసింది.

  • మార్చి 19: హోలీ- మణిపూర్​, బిహార్​, ఒడిశా సహా పలు ఇతర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

  • మార్చి 20: ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినం.

  • మార్చి 22: బిహార్​ దివాస్​- ఈ రోజు బీహార్ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది.

  • మార్చి 26: నాలుగో శనివారం అయినందున బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.

  • మార్చి 27: ఆదివారం కూడా బ్యాకులకు సాధారణ సెలవు.


నోట్​: బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఆన్​లైన్ సదుపాయాలు అందబాటులో ఉంటాయి. ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ సహా ఐఎంపీఎస్​, యూపీఐ సదుపాయాలు 24x7 అందుబాటులో ఉంటాయి. ఏటీఎంలు కూడా పని చేస్తాయి. కాబట్టి బ్యాంక్​లో ఏదైనా తప్పనిసరి పని ఉంటే తప్పా.. సెలవుల వల్ల సాధారణ వినియోగదారులకు ఎలాంటి ప్రభావం పడదు.


Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, మార్చ్ 13, 2022 ఇవాళ్టి ధరలు


Also read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook