Three-day work week: సాధారణంగా అన్ని చోట్లా వారానికి ఆరు రోజుల పని, ఓ రోజు సెలవు ఉంటుంది. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఐదు రోజుల వర్క్, రెండు రోజుల సెలవు ఉంటుంది. అయితే బెంగళూరు(Bengaluru)కు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ '‘స్లైస్'’(Slice) ఓ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కేవలం మూడు రోజుల పనిదినాల (Three-day work week)విధానాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు, వారానికి మూడు రోజులే పనిచేసినా ప్రస్తుత మార్కెట్ వేతనాలకు అనుగుణంగా 80శాతం చెల్లిస్తామని హామీ కూడా ఇస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సగటు మనుషుల జీవితం మొత్తం గడిపేయడానికి తాము విరుద్ధమని, తమ వద్ద ఉద్యోగం చేసుకుంటూనే ఇతర హాబీలను కొనసాగించుకోవచ్చని కంపెనీ వ్యవస్థాపకుడు రాజన్ బజాజ్ (28) తెలిపారు. ‘ఫ్యూచర్ వర్క్(Feauter Work)’ ఇదేనని జోస్యం చెప్పారు. ప్రజలు ఒక్క ఉద్యోగానికే పరిమితం కావాలనుకోవడం లేదని ఆయన అన్నారు. 


Also read: Sleeping while Traveling: ప్రయాణాల్లో తెలియకుండానే ఎందుకు నిద్రపోతుంటామో తెలుసా..??


‘స్లైస్’లో ఇప్పటికే 450 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే మూడేళ్లలో మరో 1000 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. ఉద్యోగులు మూడు రోజులు పనిచేసినా పూర్తిస్థాయిలో వేతనాలు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయని బజాజ్ వివరించారు. మిగతా సమయాన్ని వారు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, ఇటీవల సైబర్ సెక్యూరిటీ కంపెనీ టీఏసీ సెక్యూరిటీ నాలుగు రోజుల పనివిధాన్ని తీసుకొచ్చింది. ఉత్పాదకతను మరింత పెంచేందుకు గత ఏడు నెలలుగా శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G\


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook