Best Cars Under 10 Lakhs: రూ.10 లక్షల లోపు బెస్ట్ కార్లు ఇవే.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ..
Best Cars Under 10 Lakhs: కారు కొనుక్కోవాలనేది సామాన్య, మధ్య తరగతి ప్రజల కల. వీరు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉండేలా కోరుకుంటారు. అలాంటి వారి కోసం మేము కొన్ని కార్లు సజెస్ట్ చేస్తున్నాం.
Cars Under 10 Lakh: కొవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సొంత వాహానాల్లోనే తిరగాలని కోరుకుంటున్నారు. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలంటే కారు బెస్ట్ ఆప్షన్. సామాన్య, మధ్య తరగతి వారు తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫీచర్స్ ఉన్న కారును కొనుక్కోవాలని చూస్తారు. అలాంటి స్ఫెషికేషన్స్ కలిగిన కార్లనే మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇందులో సేఫ్టీకి ఎలాంటి ఢోకా లేదు. హై స్ట్రెంగ్త్ స్టీల్, ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సేఫ్టీ బెల్ట్ అలర్ట్ సిస్టమ్, రియర్ సీట్ బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. కింద చెప్పిన అన్ని కార్లులోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఓ లుక్కేయండి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ - దీని ధర రూ. 5.92 లక్షలతో మొదలై రూ. 8.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.హ్యుందాయ్ ఎక్సెటర్- దీని ధర రూ. 6.12 లక్షల నుండి మొదలై రూ. 9.16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ ఆరా- దీని ధర రూ. 6.48 లక్షల నుండి మొదలై రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ ఐ20- దీని ధర రూ. 7 లక్షలతో మొదలై రూ. 11.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హ్యుందాయ్ వెన్యూ- దీని ధర రూ. 7 లక్షల నుండి మొదలై రూ. 11.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
టాటా నెక్సాన్- దీని ధర రూ. 8 లక్షల నుండి మొదలై రూ. 6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
Also Read: Best Mileage Ev Bikes: తక్కువ బడ్జెట్‌లో 100కి.మీ మైలెజీని ఇచ్చే టాప్ ఎలక్ట్రిక్ స్కూటీలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter