Best Mileage Ev Bikes In India: ప్రస్తుతం మార్కెట్లో EV స్కూటర్లలో అధిక డ్రైవింగ్ రేంజ్ కలిగిన వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంది. చాలా మంది ఎక్కువగా పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన EV స్కూటీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆటో కంపెనీలు కూడా 100 కిలోమీటర్లకు పైగా మైలెజీని అందించే స్కూటీలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. గత సంవత్సరంలో ఎక్కువ మైలేజీతో మార్కెట్లోకి వచ్చిన EV ఇ-టూ వీలర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
OLA S1 Pro Gen 2:
ప్రముఖ ఆటో కంపెనీ ఓలా ఇటీవలే విడుదల చేసిన OLA S1 Pro Gen 2 స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 195 కి.మీల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటీ సీట్ ఎత్తు 805 మిమీ ఉంటుంది. కాబట్టి సులభంగా వేగాన్ని నియంత్రిస్తుంది. దీని గరిష్ట వేగం 120 Kmphకు ఉంది. ప్రస్తుతం ఈ స్కూటర్ 5 వేరియంట్లో లభిస్తోంది. OLA S1 Pro 5000 W పవర్ మోటార్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ రూ.1.62 లక్షలకు అందుబాటులో ఉంది.
TVS iQube:
ఈ TVS iQube స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లో లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.44 లక్షలు కాగా సంక్రాంతి సీజన్లో కొంత డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ ముందు, వెనుక టైర్లు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ స్కూటర్ 4.2 సెకన్లలో 40 kmph వేగాన్ని అందుకుంటుంది.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
బజాజ్ చేతక్:
ప్రస్తుతం ఈ బజాజ్ చేతక్ రెండు వేరియంట్లో అందుబాటులో ఉంది. చేతక్ అర్బేన్ వేరియంట్ రూ. 1.22 లక్షలు, చేతక్ ప్రీమియం రూ. 1.37 లక్షలతో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్ 3.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో 126 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. అర్బనే వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 113 కి.మీ. వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ స్కూటీలు 10 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తున్నాయి.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter