Pure EV to launch Best Electric Bike in India soon: హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ 'ప్యూర్ ఈవీ' భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇది కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్. రోజువారీ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ప్యూర్ ఈవీ సంస్థ ఈ బైక్‌ను రూపొందిస్తోంది. ఈ బైక్‌కు కంపెనీ 'Eco Dryft' అనే పేరు పట్టనుందట. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఈ బైక్‌ ధరను 2023 జనవరి మొదటి వారంలో ప్యూర్ ఈవీ సంస్థ విడుదల చేయనుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎకో డ్రైఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడింది. ఇది కంపెనీకి కొత్త ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌పై ఫుల్ ఛార్జ్‌తో 135 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని కంపెనీ చెబుతోంది. 3 kWh బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉంటుంది. ఈ బైక్‌లో గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. బైక్ నడిపే వ్యక్తి చాలా సౌకర్యవంతమైన మరియు స్థిరమైన రైడింగ్ అనుభవాన్ని పొందబోతాడని ప్యూర్ ఈవీ సంస్థ చెప్పింది. 


ప్యూర్ ఈవీ సంస్థ ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను కమ్యూటర్ మోటార్‌ సైకిల్ విభాగంలో తక్కువ ధరతో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎకో డ్రైఫ్ట్ బైక్ నాలుగు రంగు (ఎరుపు, నలుపు, బూడిద మరియు నీలం)లలో విడుదల కానుందట. ప్రస్తుతానికి కంపెనీకి భారతదేశం అంతటా 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయని సమాచారం. కంపెనీ సేల్స్ మొదలయ్యాక సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్‌ను పెంచానుందట. 


ఇక ప్యూర్ ఈవీ కంపెనీ ఇప్పటికే మరో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'eTryst 350'ని విక్రయిస్తోంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఈ బైక్ 3.5 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. ఈ బైక్ రైడింగ్ పరిధి 90 నుండి 140 కిలోమీటర్లు. దీని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 4 kW పవర్ అవుట్‌పుట్‌ను అందించగలదు. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు (డ్రైవ్, క్రాస్ ఓవర్ మరియు థ్రిల్) ఉన్నాయి.


Also Read: Dammaiguda Girl Missing: దమ్మాయిగూడ బాలిక మిస్సింగ్ కేసు.. చెరువులో మృతదేహం!


Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.