Best Investment Plan: దీపావళి చాలామందికి ఒక సెంటిమెంట్. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయంగా భావిస్తారు. అందుకే మీ కోసం ఓ అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వివరాలు అందిస్తున్నాం. ఇందులో కేవలం 5 వేల రూపాయలు పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఏకంగా 1.3 కోట్ల రూపాయలు అందుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిటైర్మెంట్ సమయంలో ఆర్ధికంగా బలంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇది అవసరం కూడా. అందుకే సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎంచుకోవల్సి ఉంటుంది. మ్యూచ్యువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం చాలా మంచిది. అయితే ఇది మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులోనే క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుతాయి. మీ వయస్సు 30 ఏళ్లయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎస్ఐపీ అనేది సరైన విధానం. ఎస్ఐపీలో నెలకు 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. మంచి లాభాలు పొందవచ్చు. 30 ఏళ్ల పాటు ఎస్ఐపీలో నెలకు 5 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏడాదికి 11 శాతం రిటర్న్స్ లభిస్తాయి.ఈ లెక్కన 30 ఏళ్ల తరువాత మీరు రిటైర్ అయ్యే సమయానికి 1.3 కోట్లు అందుతాయి. 


అయితే మ్యూచ్యువల్ ఫండ్స్ అనేది మార్కెట్ రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి 11 శాతం కంటే రెట్టింపు లాభాలు కూడా రావచ్చు. ఒక్కోసారి తక్కువ ఉండవచ్చు. అందుకే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయాలన్ననా లేదా ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలన్నా నిపుణుల అభిప్రాయం తప్పకుండా పరిగణలో తీసుకోవాలి. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు. 


Also read: Maharashtra Elections 2024: మహారాష్ట్రలో ఇండీ కూటమి సీట్ల సర్దుబాటు ఫిక్స్, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.