Best Investment Plans: సేవింగ్ లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే..అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. ఇందులో కేవలం 500 నుంచి ప్రారంభిస్తే..40 లక్షల వరకూ రిటర్న్ పొందవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అద్భుతమైన రిటర్న్స్, గ్యారంటీ కలిగిన పెట్టుబడి కావాలంటే ప్రభుత్వ పధకాలే మంచి ప్రత్యామ్నాయం. పీపీఎఫ్ ఎక్కౌంట్ గురించి కీలకమైన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెంటనే పెట్టుబడి పెట్టేందుకు యోచిస్తారు. ఈ పధకంలో మంచి ఆకర్షణీయమైన వడ్డీతో పాటు ఇన్‌కంటాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది. దాంతోపాటు రిస్క్,టెన్షన్ ఉండదు. అవసరమైనప్పుడు డబ్బులు వాపసు తీసుకోవచ్చు కూడా.


మీకు సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి పీపీఎఫ్ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రభుత్వ పథకమైనందున వడ్డీ రేటు ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్ 5 వందల రూపాయల్నించి ప్రారంభించవచ్చు. పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ప్రతియేటా కనీసం 500 జమ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి జమ చేయాలనే నిబంధన లేదు. మీ సౌకర్యం మేరకు కొద్ది కొద్దిగా కూడా జమ చేయవచ్చు. 


పీపీఎఫ్ ఎక్కౌంట్‌పై ఏడాదికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ 15 ఏళ్లుంటుంది. ఒకవేళ ఏడాదిలో 500 జమ చేయలేకపోతే..మీ ఎక్కౌంట్ డీఫాల్ట్ కేటగరీలో వెళ్లిపోతుంది. తిరిగి యాక్టివేట్ చేసేందుకు 50 రూపాయలు పెనాల్టీ చెల్లించాలి.


పీపీఎఫ్ ఎక్కౌంట్ 15 ఏళ్లు పూర్తయిన తరువాత మొత్తం డబ్బు వడ్డీతో సహా పొందవచ్చు. కానీ ఒకవేళ డబ్బులు అప్పుడే అవసరం లేకపోతే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా మీకు నచ్చినంతకాలం పెంచుకోవచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన తరువాత ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.


పీపీఎఫ్ ఎక్కౌంట్ 15 ఏళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ఏడాదికి మీరు జమ చేసే మొత్తాన్ని బట్టి మీకు ఎంత వస్తుందనేది ఉంటుంది. 1000 రూపాయలు నెలకు జమ చేస్తే 15 ఏళ్లకు 3 లక్షల 15 వేల 572 రూపాయలు చేతికి వస్తాయి. నెలకు 2 వేల చొప్పున జమ చేస్తే..6 లక్షల 31 వేలు అందుతాయి. నెలకు 3 వేల రూపాయలు పెట్టుబడి పెడితే..9 లక్షల 46 వేల రూపాయలు వస్తాయి. నెలకు 4 వేల రూపాయలు జమ చేస్తే 15 ఏళ్లకు 12 లక్షల 72 వేలు వస్తాయి. నెలకు 5 వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే..15 ఏళ్లకు 15 లక్షల 77 వేల రూపాయలు అందుతాయి. ఇక నెలకు 10 వేల రూపాయలైతే..15 ఏళ్లకు 31 లక్షల 55 వేలు అందుతాయి. 


Also read: Highest Salary Hike: ఎక్కువ శాలరీ హైక్ ఇచ్చే ఐటీ కంపెనీలు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook