Highest Salary Hike: అన్ని ఐటీ కంపెనీల జీతాలు ఒకేలా ఉండవు కానీ కొన్ని కంపెనీల జీతాలు భారీగానే ఉంటాయి. అత్యధికంగా జీతాలిస్తున్న ఐదు కంపెనీల వివరాలు తెలుసుకుందాం..
కోఫోర్జ్, ఎల్‌అండ్‌టి ఇన్‌ఫోటెక్, పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ కంపెనీల జీతాలు ఇటీవల భారీగా పెరిగాయి. దాదాపుగా రెట్టింపయ్యాయని చెప్పవచ్చు. గత 4 ఏళ్లలో ఇదే అత్యధికం. ఎలారా కేపిటల్ అనే బ్రోకరేజ్ మరియు రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం 2022 ఆర్ధిక సంవత్సరంలో మధ్యస్థాయి దేశీయ ఐటీ కంపెనీలు 2.4 రెట్లు జీతాలు పెంచాయి. కంపెనీలవారీగా పరిశీలిస్తే..
కోఫోర్జ్ కంపెనీ ఏడాదికి 27.2 శాతం చొప్పున జీతం పెంచుతోంది. ఇక ఎల్‌అండ్‌టి ఇన్‌ఫోటెక్ కంపెనీ తన ఉద్యోగులకు 18.3 శాతం చొప్పున జీతం పెంచింది. మూడవ స్థానంలో పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ కంపెనీ 14.5 శాతం, ఎంఫాసిస్ కంపెనీ 9 శాతం, మైండ్‌ట్రీ కంపెనీ 7 శాతం చొప్పున జీతాలు పెంచాయి. 2017-22 వరకూ పరిశీలిస్తే..కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ విషయంలో ఎల్‌అండ్‌టీ, కోఫోర్జ్ కంపెనీలు అగ్రస్థానంలో నిలవగా, మైండ్ ట్రీ, ఎంఫాసిస్ కంపెనీలు తరువాత ఉన్నాయి.
2022 ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగుల వృద్ధి జీతాల కంటే పెరిగిది. గత నాలుగేళ్లలో వేగం పుంజుకుంది. పిరమిడ్ రీస్ట్రక్చరింగ్ మోడల్ ప్రకారం తక్కువ అనుభవంతో ఎక్కువమంది ఉద్యోగులుంటే..ఎక్కువ అనుభవం కలిగినవాళ్లు తక్కువగా ఉన్నారు. టాప్‌క్లాస్ స్కిల్డ్ సిబ్బందికి ఐటీ దిగ్గజ కంపెనీలు ఎక్కువగా చెల్లిస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి క్లౌండ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, క్రిప్టోకరెన్సీ లావాదేవీల సేవలకు డిమాండ్ అధికంగా ఉంది.
2 టైర్ ఐటీ కంపెనీల వార్ధిక నివేదికల ప్రకారం ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫోటెక్, మైండ్ ట్రీ, ఎంఫాసిస్, కోఫోర్జ్, పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ కంపెనీల జీతాలు అధికంగా ఉన్నాయి. ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఇంజనీరింగ్ సాధ్యాసాధ్యాయలు, ఆర్‌అండ్‌డి సేవలపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్ వృద్ధి రేటు 41 శాతంగా ఉంది.
Also read: Jio, Airtel, Vi: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఏడాది వాలిడిటీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook