Post Office FD Plans: మీరు పెట్టే పెట్టుబడులు రిటర్న్‌తో పాటు సురక్షితంగా ఉండాలంటే..పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మంచి ప్రత్యామ్నాయంగా కాగలవు. పోస్ట్ ఆఫీసులో ఎఫ్‌డి చేస్తే బ్యాంక్ కంటే ఎక్కువ లాభం కలగనుంది. ఇది పూర్తిగా సురక్షితం కూడా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్త దృష్టిలో ఉంచుకుని..సేవింగ్ ప్లాన్స్ ఆలోచిస్తుంటే..ఇది మీ కోసమే. చిన్న చిన్న పెట్టుబడులు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్స్ మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో ఎఫ్‌డి చేస్తే మీకు వడ్డీతో పాటు ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి. లాభంతో పాటు ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంటుంది. ఇందులో డిపాజిట్ ఆధారిత వడ్డీ లభిస్తుంది. ఇందులో ఎఫ్‌డి చేయడం చాలా సులభం కూడా. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్  ప్రకారం..పోస్టాఫీసులో 1,2,3,5 ఏళ్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో ఏయే ప్లాన్స్ ఉన్నాయో తెలుసుకుందాం..


పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాభాలు


పోస్టాఫీసులో ఎఫ్‌డి చేస్తే ప్రభుత్వం తరపున గ్యారంటీ లభిస్తుంది. 
ఇందులో పెట్టుబడులు పూర్తిగా సురక్షితం
ఇందులో ఎఫ్‌డి ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేయవచ్చు
ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్‌డీలు చేయవచ్చు
ఇందులోని ఎఫ్‌డి ఎక్కౌంట్‌కు జాయింట్ కూడా చేయవచ్చు
ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై మీకు ఐటీఆర్ ఫైల్ సమయంలో ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది
పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు సులభంగా బదిలీ చేసే అవకాశం


పోస్టాఫీసులో ఎఫ్‌డి చేసేందుకు చెక్ లేదా క్యాష్ ఇవ్వవచ్చు. ఇందులో కనీసం వేయి రూపాయల నుంచి ఎక్కౌంట్ ఓపెన్ అవుతుంది. మ్యాగ్జిమమ్ లిమిట్ లేదు. పోస్టాఫీసులో 7 రోజుల్నించి 1 ఏడాది వరకూ ఎఫ్‌డిపై 5.50 వడ్డీ లభిస్తుంది. 1 ఏడాది 1 రోజు నుంచి 2 ఏళ్ల వరకూ కూడా ఇదే వడ్డీ. ఇది కాకుండా మూడేళ్ల వరకూ 5.50 వడ్డీ లభిస్తుంది. ఇక ముూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకైతే..6.70 వడ్డీ లభిస్తుంది. 


Also read: Flipkart End of Season Sale: ఎంఐ, థామ్సన్, శాంసంగ్ బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్లు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook