Flipkart End of Season Sale: ఎంఐ, థామ్సన్, శాంసంగ్ బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్లు

Flipkart End of Season Sale రేపట్నించి ప్రారంభం కానుంది. ఖరీదైన స్మార్ట్‌టీవీలు అత్యంత చౌకధరకు లభించనున్నాయి. శాంసంగ్, ఎంఐ, థామ్సన్, కొడక్, వెస్టింగ్ హౌస్ సహా పలు బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2022, 03:33 PM IST
 Flipkart End of Season Sale: ఎంఐ, థామ్సన్, శాంసంగ్ బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్లు

Flipkart End of Season Sale రేపట్నించి ప్రారంభం కానుంది. ఖరీదైన స్మార్ట్‌టీవీలు అత్యంత చౌకధరకు లభించనున్నాయి. శాంసంగ్, ఎంఐ, థామ్సన్, కొడక్, వెస్టింగ్ హౌస్ సహా పలు బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ రేపట్నించి అంటే జూన్ 11 నుంచి ప్రారంభమై..17వ తేదీ వరకూ సాగుతుంది. ఈసేల్‌లో స్మార్ట్‌టీవీ, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండీషనర్‌లపై భారీ డిస్కౌంట్ లభించనుంది.  ఒకవేళ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. ఖరీదైన స్మార్ట్ టీవీలు తక్కువ ధరకే లభించనున్నాయి. శాంసంగ్, ఎంఐ, థామ్సన్, కొడక్, వెస్టింగ్ హౌస్ వంటి పలు బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.

కొడక్ టీవీ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కోసం భారీ సేల్ ఆఫర్ చేస్తోంది. కొడక్ సీఏ ప్రో, 7ఎక్స్ ప్రో సిరీస్‌పై అతిపెద్ద డీల్ ప్రవేశపెడుతోంది. దీని ధర 6 వేల 999 రూపాయల కంటే తక్కువే. 43 ఇంచెస్, 50 ఇంచెస్ మోడల్‌పై భారీగా తగ్గుదల కన్పించనుంది. 32 ఇంచెస్ టీవీ 11 వేల 499 రూపాయలు కాగా, 43 ఇంచెస్ టీవీ 24 వేల 999 రూపాయలు, 50 ఇంచెస్ టీవీ 27 వేల 999 రూపాయలుంది. 

కొడక్ టీవీ బేజల్ లేస్ డిజైన్‌తో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ కలిగి ఉంటుంది. ఇందులో 5 లక్షల కంటే ఎక్కువ టీవీ షోతో పాటు ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5, సోని లివ్, గుగుల్ ప్లే స్టోర్ వంటి 6 వేలకంటే ఎక్కువ యాప్స్, గేమ్స్ ఉన్నాయి. రిమోట్ కంట్రోల్‌పై ప్రైమ్, యూట్యూబ్, సోని లివ్ షార్ట్‌కట్ కీలున్నాయి.

ధామ్సన్ స్మార్ట్ టీవీ సేల్ వేగం పుంజుకుంటోంది. 32 ఇంచెస్ టీవీ స్మార్ట్ టీవీ ధర 10 వేల 999 రూపాయలు కాగా, 40 ఇంచెస్ టీవీ 17 వేల 999 రూపాయలు, 43 ఇంచెస్ టీవీ 21 వేల 999 రూపాయలు, 50 ఇంచెస్ టీవీ 28 వేల 999 రూపాయలు, 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర 34 వేల 999 రూపాయలుంది. మరోవైపు 1 టన్ త్రీ స్టార్ స్ప్లిట్ ఏసీ 24 వేల 999 రూపాయలు కాగా, 1.5 టన్ ఫైవ్‌స్టార్ ఏసీ ధర 31 వేల 999 రూపాయలుంది. ఇందులోనే 3 స్టార్ అయితే 29 వేల 999 రూపాయలుంది. 

Also read: Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News