SIP Investment Tips: ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ కీలకమైంది. మీ జీతం 30 వేలున్నా సరే ప్రణాళికా బద్ధంగా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తే లక్షాధికారి కావచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. అదెలాగో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ వేలల్లో సంపాదిస్తున్నా సరైన ప్లానింగ్ లేకపోవడంతో నాలుగు డబ్బులు వెనకేసుకోలేని పరిస్థితి ఉంటోంది. సరైన ప్లానింగ్ ఉంటే జీతం 25 వేలున్నా లేక 30 వేలున్నా సరే లక్షాధికారి కావచ్చంటున్నారు. దీనికోసం సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరమౌతుంది. ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా సాధ్యమని అనుకుంటుంటారు. కానీ మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ ద్వారా ఇది సాధ్యమే. సరైన ఎస్ఐపీ ద్వారా లక్షధికారి కావచ్చు కూడా. 


మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ అనేది మార్కెట్ ఆధారిత స్కీమ్. ఇందులో రిటర్న్స్‌పై గ్యారంటీ ఉండదు. కానీ షేర్ మార్కెట్‌తో పోలిస్తే రిస్క్ తక్కువ. ఇందులో సరాసరిన రిటర్న్ దీర్ఘకాలంలో 12 శాతముంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది పెరుగుతుంది కూడా. దీర్ఘకాలంలో మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టే పెట్టుబడి పెరుగుతూ పోతుంది. 


కేవలం 30 వేల ఆదాయంతో లక్షాధికారి కావాలంటే 50-30-20 ఫార్ములా పాటించాలంటున్నారు నిపుణులు. అంటే మీ ఆదాయంలో 20 శాతం అంటే 6 వేల రూపాయలు ప్రతి నెలా ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే 24 ఏళ్లకు కోటీశ్వరులు కావడం ఖాయం. ఎందుకంటే నెలకు 6 వేల చొప్పున 24 ఏళ్లకు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం 17,28,000. 12 శాతం రిటర్న్స్ లెక్కేసుకుంటే 83, 08,123 రూపాయలు అవుతుంది. మొత్తం మీద 24 ఏళ్లలో మీ సంపాదన 1 కోటి 36 వేల 123 రూపాయలవుతుంది. 


Also read: LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook