Life Insurance Policy Plans: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు సాధారణంగా ఒక వ్యక్తికే వర్తిస్తాయి. ఎవరి పేరు మీద ప్రీమియం చెల్లిస్తే వాళ్ల మరణాంతరం కుటుంబానికి ఇన్సూరెన్స్ అమౌంట్ అందుతుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎడెల్విస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లెగసీ ప్లస్‌ను పరిచయం చేస్తోంది. ఒక ప్రీమియం ద్వారా ఇద్దరికి లైఫ్‌ కవర్ అందేలా ఈ ప్లాన్‌ను రూపొందించింది. చైల్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, లెగసీ ప్లానింగ్, అది కొనసాగే వ్యవధిలో ఏవైనా అత్యవసర అవసరాలకు ఈ పాలసీ సపోర్ట్‌గా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Upcoming Smartphones in March 2024: మార్చి నెలలో తక్కువ ధరలో లాంచ్‌ అయ్యే మొబైల్స్‌.. వాటి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!


కొత్త ప్రొడక్ట్ గురించి ఎడెల్విస్ టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుభ్రజిత్ ముఖోపాధ్యాయ మాట్లాడుతూ.. సాధారణంగా ఇంట్లో సంపాదిస్తున్న ప్రతి మనిషికి కుటుంబం గురించి ఎక్కువ ఆందోళన ఉంటాయన్నారు. పిల్లల భవిష్యత్‌, పదవీ విరమణ, ఏదైనా ఊహించని ఆకస్మిక పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కొవాలని ఆలోచిస్తుంటారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు.


లెగసీ ప్లస్ పాలసీ ద్వారా కుటుంబ ఆర్థిక అవసరాలను ఒకే ప్రొడక్ట్ ద్వారా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. అక్రూవల్ ఆఫ్ సర్వైవల్ బెనిఫిట్ ద్వారా మొత్తం కుటుంబ యూనిట్‌ పర్సనలైజేషన్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పాలసీదారు తన అవసరాలకు అనుగుణంగా ఆదాయాన్ని ఉపసంహరించుకోవచ్చని వివరించారు. 100 ఏళ్ల వయస్సు వరకు ఆదాయ ప్రయోజనం అందిస్తుని చెప్పారు. ప్రాథమిక లేదా ద్వితీయ జీవిత బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో కూడా పాలసీ వ్యవధి ముగిసే వరకు ప్లాన్ ఆదాయాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్లాన్ ఆదాయ చెల్లింపు నుంచి కుటుంబంలోని కనీసం 3 తరాలు ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు. లెగసీ ప్లస్ 2 బేస్ ప్లాన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉందన్నారు.


ప్రాథమిక జీవిత బీమాతో కూడిన ఉమ్మడి జీవిత కవరేజీ పెద్దలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరికీ డెత్ బెనిఫిట్స్, 100 ఏళ్ల వయస్సు వరకు ఆదాయం హామీ ఉంటుంది. ప్రాథమిక బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో ప్రీమియం మినహాయింపు ఉంటుంది. కానీ పాలసీ అమలులో ఉంటుంది. ప్రాథమిక బీమా చేసిన వ్యక్తి 100 ఏళ్ల వయస్సు వరకు ఆదాయం కొనసాగుతుంది. అక్రూవల్ ఆఫ్ సర్వైవల్ బెనిఫిట్ వంటి ఐచ్ఛిక ఫీచర్లు, ప్రీమియం మినహాయింపు, చెల్లింపుదారు మినహాయింపు ప్రయోజనం మరిన్ని వంటి అదనపు రైడర్లను యాడ్ చేసుకుని ప్లాన్‌ను మెరుగుపరుచుకోవచ్చు. 


Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter