Top Performing Mutual Funds: కొత్త ఆర్థిక సంవత్సరం మెుదలుకానుంది. ఈ నేఫథ్యంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టి భారీగా సంపాదించాలనుకుంటున్నారు. అయితే వారికి ఎందులో పెడితే ఎక్కువ రాబడి వస్తుందో తెలియదు. అయితే మీకు ఎలాంటి స్టాక్ లేదా ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే అధిక మెుత్తంలో డబ్బులు వచ్చే వాటి గురించి ఇక్కడ మీకు చెబుదాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ మరియు లార్జ్‌క్యాప్ ఫండ్‌ వంటి కంపెనీలు అయితే ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 44 శాతం నుండి 70 శాతం మధ్య రాబడిని ఇస్తున్నాయి. గత ఏడాదిలో పెట్టుబడిదారులకు 50 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించిన టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్‌ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్: తమ ఆస్తులలో కనీసం 65 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే ఏ ఫండ్ ఎంత రాబడిని ఇస్తుందో తెలుసుకుందాం. 
ఒక సంవత్సరంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ -
>> బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ - 69.54 శాతం రాబడి
>> క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ - 66.51 శాతం రాబడి
>> మహీంద్రా మ్యానులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్- 65.84 శాతం రాబడి
>> ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ - 62.71 శాతం రాబడి
>> ఇన్వెస్కో ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ - 53.24 శాతం రాబడి
>> ఫ్రాంక్లిన్ ఇండియా చిన్న కంపెనీల ఫండ్ - 52.90 శాతం రాబడి


మిడ్ క్యాప్ ఫండ్స్: ఈ ఆర్థిక సంవత్సరంలో మిడ్‌క్యాప్ స్టాక్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి. సెబీ సూచనల ప్రకారం, మిడ్‌క్యాప్ షేర్లలో కనీసం 65 శాతం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిదారులకు 56 శాతం నుండి 65 శాతం వరకు రాబడిని అందించిన టాప్ మిడ్‌క్యాప్ స్టాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక సంవత్సరంలో మిడ్‌క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ -
>> క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ - 65.56 శాతం రాబడి
>> ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ - 62.70 శాతం రాబడి
>> మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ - 60.37 శాతం రాబడి
>> మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ - 59.61 శాతం రాబడి
>> HDFC మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ - 57.23 శాతం రాబడి
>> జేఎమ్ మిడ్‌క్యాప్ ఫండ్ - 56.98 శాతం రాబడి


Also Read: Income Tax: న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ట్యాక్స్ సేవ్ చేయడం ఎలా, ఈ టిప్స్ పాటించండి


లార్జ్ క్యాప్ ఫండ్స్: ఈ ఫండ్స్‌కు సంబంధించి వ్యక్తి యెుక్క ఆస్తుల్లో 80 శాతం లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. గతంలో ఈ ఫండ్స్ పెట్టుబడిదారులకు 44 శాతం నుండి 52 శాతం మధ్య రాబడిని ఇచ్చాయి. 
ఒక సంవత్సరంలో మిడ్‌క్యాప్ ఫండ్స్ రిటర్న్స్ -
>> క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్- 52.38 శాతం రాబడి
>> బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూచిప్ ఫండ్ - 47.74 శాతం రాబడి
>> జేఎమ్ లార్జ్ క్యాప్ ఫండ్ - 45.42 శాతం రాబడి
>> నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ - 44.82 శాతం రాబడి
>> టారస్ లార్జ్ క్యాప్ ఫండ్ - 44.04 శాతం రాబడి


Also Read: Hero Pleasure Xtec Price: రూ.79 వేల ధరతో స్పోర్టీ స్ట్రైప్డ్ థీమ్ Hero స్కూటీ లాంచ్‌.. పూర్తి వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook