LIC Jeevan Shanti Plan 2023: దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి. కాస్త డబ్బులు సంపాదిస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం చాలామంది ఓ వైపు సంపాదనపై దృష్టిపెడుతూనే.. మరోవైపు రిటైర్మెంట్‌ తరువాత జీవితం హ్యాపీగా సాగిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారు. పదవీ విరమణ తరవాత ప్రతి నెలా పెన్షన్ వచ్చేలా ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తుంటే.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అనేక పథకాలను ప్రజలకు అందజేస్తుంది. వీటిలో పెన్షన్ ప్లాన్ కూడా ఉంది. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్‌ఐసీ కొత్త జీవన్ శాంతి ప్లాన్ ఒకే ప్రీమియం ప్లాన్. ఇందులో పాలసీదారు సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ పాలసీ ప్రకారం.. మీరు పాలసీని కొనుగోలు చేసిన వెంటనే పెన్షన్ మొత్తం ఫిక్స్ అయిపోతుంది. పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు చెబుతారు. వాయిదా అనంతరం యాన్యుయిటీలు జీవితాంతం చెల్లిస్తారు.


ఎవరు తీసుకోవచ్చు..?


ఈ పాలసీ తీసుకోవాలంటే.. కనీసం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. అయితే గరిష్ట పెట్టుబడిపై లిమిట్ లేదు. 30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీదారు జీవితకాలంలో పెన్షన్ రూపంలో ప్రతి నెలా హామీతో కూడిన ఆదాయాన్ని పొందుతాడు. ఒకవేళ ప్రాథమిక యాన్యుయిటెంట్ చనిపోతే.. నామినీ/సెకండరీ యాన్యుయిటెంట్‌కు హామీ ఇచ్చిన పెన్షన్ పొందుతారు.  


అవసరమైన పత్రాలు


==> అడ్రస్ ప్రూఫ్‌: కరెంట్ బిల్లు, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి.
==> గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.


యాన్యుటీ చెల్లింపు విధానం..


ఈ ప్లాన్‌లో నాలుగు రకాల యాన్యుటీలు ఉన్నాయి: వార్షిక, అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీ. యాన్యుటీ చెల్లింపు విధానంపై ఆధారపడి.. యాన్యుటీ వెస్టింగ్ తేదీ నుంచి ఒక సంవత్సరం, ఆరు నెలలు, మూడు నెలలు లేదా ఒక నెల తర్వాత చెల్లిస్తారు.


ఈ నిబంధనలు తప్పనిసరి..


==> పాలసీని ప్రారంభించే సమయానికి కనీస వయస్సు: 30 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
==> పాలసీని ప్రారంభించే గరిష్ట వయస్సు: 79 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
==> కనీస వెస్టింగ్ వయస్సు: 31 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
==> గరిష్ట వెస్టింగ్ వయస్సు: 80 సంవత్సరాలు (చివరి పుట్టినరోజు)
==> కనిష్ట వాయిదా వ్యవధి: 1 సంవత్సరం
==> గరిష్ట వాయిదా వ్యవధి: గరిష్ట వెస్టింగ్ వయస్సుకి లోబడి 12 సంవత్సరాలు


పెన్షన్ ఇలా..


==> నెలవారీగా ఎంచుకుంటే-నెలకు రూ.1000
==> త్రైమాసికానికి ఎంచుకుంటే-త్రైమాసికానికి రూ.3 వేలు
==> అర్ధ సంవత్సరానికి ఎంచుకుంటే- రూ.6 వేలు
==> సంవత్సరానికి ఎంచుకుంటే- ఏడాదికి రూ.12 వేలు


Also Read: Financial Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఆలోపు ఈ పనులు పూర్తి చేయండి


Also Read: MLA Undavalli Sridevi: జగన్ దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయింది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి