Financial Rules Changing From 1st April 2023: త్వరలో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకాబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ మొదలుతో కొత్త రూల్స్ కూడా అమలు కానున్నాయి. ఈలోపు కంప్లీట్ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు గురించి తప్పకుండా తెలుసుకోండి. పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. అదేవిధంగాఇ పలు ఆటో కంపెనీల వాహనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే 10 ఆర్థిక మార్పుల గురించి వివరాలు ఇలా..
1.పాన్-ఆధార్ లింక్..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మార్చి 31 నాటికి పాన్-ఆధార్‌ను లింక్ చేయడానికి గడువుగా విధించింది. ఈ తేదీలోపు రెండు డాక్యుమెంట్‌లను లింక్ చేయకపోతే.. పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఆధార్‌తో లింక్ చేసేటప్పుడు మీరు రూ.10 వేల జరిమానా చెల్లించాలి.
2.కార్ల ధరలు పెంపు
భారత్ స్టేజ్-2 అమలుతో పలు కంపెనీల కార్లు ఖరీదు పెరగనున్నాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, టయోటా, ఆడి వాహనాల ప్రైస్ పెరగనుంది. ఈ కంపెనీలన్నీ తమ కొత్త రేట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నాయి. వివిధ కంపెనీల కార్లు రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
3. హాల్‌మార్క్ లేకుండా..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో బంగారం అమ్మకానికి సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. జ్యువెలర్లు 6 అంకెల HUID నంబర్ రిజిస్టర్ చేసిన ఆభరణాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వినియోగదారుల విభాగం జనవరి 18న ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఖాతాదారులు పాత ఆభరణాలను హాల్‌మార్క్ గుర్తు లేకుండా విక్రయించుకోవచ్చు.
4.బీమా పాలసీపై ట్యాక్స్
ఇక నుంచి రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం పాలసీని కొనుగోలు చేస్తుంటే.. బీమా పథకం ద్వారా వచ్చే ఆదాయంపై ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
5.డీమ్యాట్ ఖాతాలో నామినేషన్ తప్పనిసరి..
డీమ్యాట్ ఖాతాదారులు ఏప్రిల్ 1వ తేదీలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ అకౌంట్ నిలిచిపోతుంది. సెబీ సర్క్యులర్ ప్రకారం.. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలో నామినీని యాడ్ చేయాల్సిందే.
6. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా..
అన్ని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ నామినేషన్‌ను మార్చి 31లోపు పూర్తి చేయాలని సెబీ ఆదేశించింది. లేకపోతే ఏప్రిల్ 1వ నుంచి పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో స్తంభింపజేయనుంది. వివరాలను సమర్పించిన తర్వాత మాత్రమే మళ్లీ ప్రారంభమవుతుంది.
7. దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డు
ఏప్రిల్ 1వ తేదీ నుంచి దివ్యాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డు (UDID) నంబర్ చెప్పడం తప్పనిసరి. యూడీఐడీ లేని వారు తమ యూడీఐడీ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం అవుతాయి.
8.15 రోజులు బ్యాంకులు బంద్
ఏప్రిల్ నెలలో వివిధ పండుగలు, వార్షికోత్సవాల కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.
9. 6 శాతం పెంపు..
ప్రస్తుతం నగదు ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్స్ సెగ్మెంట్‌లో ఏ రకమైన లావాదేవీ అయినా 6 శాతం వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి ఫీజు ఉండదు.
10. గ్యాస్ ధరలలో మార్పు
ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్, సీఎన్‌జీ ధరలను మారుస్తాయి. వాణిజ్య, గృహ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఉపశమనం లభిస్తుందో.. లేక మళ్లీ పెరుగుదల ఉంటుందో చూడాలి.
Also Read: TSRTC: ప్రయాణిలకు గుడ్‌న్యూస్.. తొలిసారి అందుబాటులోకి ఏసీ బస్సులు.. ప్రత్యేకతలు ఇవే..
Also Read: MLA Undavalli Sridevi: జగన్ దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయింది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి