Best Smart Watch: రూ. 1 వెయ్యిలోపే Gizmore Blaze Max స్మార్ట్ వాచ్.. కాలింగ్ ఫీచర్‌తో పాటు 5 కొత్త ఫీచర్లు..
Best Smart Watch Under 1500 In India: భారత మార్కెట్‌లో ప్రతి వారం కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లు విడుదలవుతున్నాయి. ఇవి వినియోగదారల అంచనాలతో లభించడం విశేషం. అయితే ఇటీవలే లాంచ్ అయిన గిజ్మోర్(Gizmore Blaze Max) కంపెనీకి చెందిన స్మార్ట్‌వాచ్ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Best Smart Watch Under 1500 In India: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల బ్రాండ్స్‌కి సంబంధించి స్మార్ట్‌వాచ్‌లు లభిస్తున్నాయి. అందులో కొన్న డెడ్ ఛీప్‌గా లభిస్తే.. మరి కొన్ని చాలా చౌకగా లభిస్తున్నాయి. అయితే చాలా మంది మార్కెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన తక్కువ ధరలు గల వాచ్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవలే లాంచ్ అయిన వాచ్‌ల్లో గిజ్‌మోర్ కంపెనీకి చెందిన స్మార్ట్‌వాచ్‌లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు అసక్తి చూపుతున్నారు. గిజ్‌మోర్ ఈ మధ్యే బ్లేజ్ మ్యాక్స్ పేరుతో మరో స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో లభించే అతి కొద్ది తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌గా పేరు తెచ్చుకుంది.
స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఇవే:
ఈ గిజ్‌మోర్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు అన్ని వాచ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది 1.85-అంగుళాల IPS డిస్‌ప్లేతో వినియోగదారులకు మార్కెట్‌లో లభిస్తోంది. అయితే ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 15 రోజుల పాటు వస్తుంది. అంతేకాకుండా 450 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.అన్ని డిస్‌ప్లేలా కాకుండా ఎప్పుడు ఆన్‌లో ఉంటుంది. ఇలాంటి ఫీచర్ అధిక బడ్జెట్‌లో ఉండే స్మార్ట్ వాచ్‌ల్లో లభిస్తుంది.
స్మార్ట్‌వాచ్ అదనపు స్పోర్ట్స్ మోడ్:
స్మార్ట్‌వాచ్‌లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడానికి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్‌లో ఆరోగ్యానికి సంబంధించిన చాలా రకాల ఫీచర్లు లభిస్తాయి. స్టెప్ కౌంట్, SpO2 స్థాయిలు, హృదయ స్పందన రేటు, కాలిన కేలరీలు, హైడ్రేషన్ హెచ్చరికలు, ఋతు ట్రాకర్, గైడెడ్ బ్రీతింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్లీప్ మానిటర్‌ను ట్రాక్ లాంటి చాలా రకాల ఫీచర్లతో లభించడం చాలా విశేషం. అంతేకాకుండా ఇది స్పోర్ట్స్ మోడ్ ఫీచర్‌తో పాటు JYOU PRO హెల్త్ సూట్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి దీనితో స్లీప్ మానిటర్‌ను ట్రాక్ చేయడం చాలా సులభం.
ఈ స్మార్ట్ వాచ్ ధర తెలుసా..?:
గిజ్‌మోర్ కంపెనీకి చెందిన బ్లేజ్ మ్యాక్స్ వాచ్ భారత బడ్జెట్ ధరలో లభిస్తోంది. స్మార్ట్ వాచ్ IP67 రేటింగ్‌తో వస్తోంది. అయితే ఈ వాచ్‌ను వ్యాయామాలు చేసే క్రమంలో వినియోగిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా హోమ్ స్క్రీన్‌పై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌తో పాటు వాతావరణాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. ఇందులో ఎన్నడు చూడని ఫీచర్‌ని కూడా మీరు చూడొచ్చు. గిజ్మోర్ బ్లేజ్ మ్యాక్స్‌తో పాటు గేమింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ వాచ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే రూ.1,199లకే లభిస్తోంది.
Also Read: Virat Kohli: సచిన్ రెండు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. చరిత్రలో తొలి ఆటగాడిగా..
Also Read: Loan on Aadhaar Card: ఆధార్ కార్డుపై కేంద్రం 4.78 లక్షల లన్ ఇస్తోందా ? ఇది నిజమేనా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి