Budget smartphones Under Rs.10K స్మార్ట్​ఫోన్​.. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారుతోంది. షాపింగ్ నుంచి బిల్లుల చెల్లింపు సహా దాదాపు అన్ని అవసరాలు స్మార్ట్​ఫోన్​తో చిటికెలో ఐపోతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కారణంగా మార్కెట్లో స్మార్ట్​ఫోన్లకు డిమాండ్ పెరిగింది. అయితే ఒకప్పుడు స్మార్ట్​ఫోన్ల ధరలు భారీగా ఉన్న కారణంగా కొంతమంది కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ సహా వివిధ కారణాల వల్ల స్మార్ట్​ఫోన్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి.


రూ. 10 వేల లోపు ధరలోనే (Smartphones Under Rs.10k) అన్ని ఫీచర్లున్న స్మార్ట్​ఫోన్లు కొనుగోలు చేసేందుకు వీలుంది. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్​ఫోన్లు రూ.10 వేల లోపు ఏవో ఇప్పుడు చూద్దాం.


జియో ఫోన్ నెక్ట్స్​..


గూగుల్, జియో సంయక్తంగా ఈ ఫోన్​ను (JioPhone next) అభివృద్ధి చేశాయి.


  • 5.45 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే (గొరిళ్లా గ్లాస్ ప్రొటెక్షన్)

  • 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్

  • క్వాల్కమ్​ శ్నాప్​డ్రాగన్​ 215, క్వాడ్​కోర్​ ప్రాసెసర్

  • 13 మెగా పిక్సెల్ రియర్​ కెమెరా

  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా

  • 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ

  • డ్యుయల్ నానో సిమ్


ధర రూ.రూ.6,499


ఒకేసారి ధర మొత్తం చెల్లించలేము అనుకుంటే.. వారికోసం ప్రత్యేక ఈఎంఐ సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చింది జియో. 18 లేదా 24 నెలల సులభతర వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది.


మైక్రోమ్యాక్స్​ ఇన్​ 2బీ..


దాదాపు పూర్తి స్థాయి దేశీయ టెక్నాలజీతో ఈ మొబైల్​ను రూపొందించింది మైక్రోమ్యాక్స్. కొంత కాలంగా స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో వెననబడిన ఈ కంపెనీ.. ఇన్​ సిరీస్​తో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్​ ధరలో ఫోన్లను (Micromax in 2B) తెస్తోంది.


  • 6.52 అంగుళాల డిస్​ప్లే

  • యునిసోక్ టి 610 ప్రాసెసర్‌ (ఆక్టాకోర్​)

  • 4 జీబీ ర్యామ్​, 64 జీబీ డిస్​ప్లే

  • 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

  • వెనకవైపు రెండు కెమెరాలు (13 ఎంపీ+2 ఎంపీ)

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​)

  • ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్​


ధర రూ.8,999


రియల్​మీ నార్జో 30ఏ (Realme Narzo 30A)


  • 6.5 అంగుళాల డిస్​ప్లే

  • మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్​

  • వెనకవైపు రెండు కెమెరాలు (13 ఎంపీ+బ్లాక్​ అండ్ వైట్ సెన్సార్​)

  • 8 ఎంపీ సెల్ఫీ కెమెరా

  • ఫింగర్​ ప్రిట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

  • 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ (18 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  • 3జీబీ ర్యామ్​+ 32 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.8,999

  • 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999


మోటో ఈ7 పవర్(Moto E7 Power)..


స్టాక్ ఆడ్రాయిడ్ కావాలనుకునే వినియోగదారులు ఈ మోబైల్​ను ఎంచుకోవచ్చు. ఈ ఫోన్లలో ఎలాంటి బ్లోట్ ఉండదు.


  • 6.51 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే

  • మీడియా టెక్ హీలియో జీ25 ప్రాసెసర్​

  • 4 జీబీ ర్యామ్​, 64 జీపీ స్టోరేజ్​

  • 13 ఎంపీ + 2 ఎంపీ మెయిన్​ కెమెరా

  • 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

  • ఆండ్రాయిడ్​ 10 ఆపరేటింగ్ సిస్టమ్​


ధర రూ.8,999


Also read: Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్


Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook