Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్​

Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్​ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్​లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 05:34 PM IST
  • టీసీఎస్​లో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు
  • దేశంలోనే అత్యధికమని ఓ నివేదికలో వెల్లడి
  • తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రో
Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్​

TCS have Highest Number Of Women employees In India: టాటా గ్రూప్​కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS)​.. మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థగా టీసీఎస్​ నిలిచింది. బుర్గిండి ప్రైవేట్ హరూన్​ ఇండియా విడుదల చేసిన నివేదికలో (Burgundy private hurun india report) ఈ విషయం తెలిసింది.

కంపెనీలో మొత్తం (Employees in TCS) 5,06,908 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 1,78,357 మంది మహిళలని (Women employees in TCS) నివేదిక పేర్కొంది.

దేశంలో టాప్​ 500 కంపెనీల్లో.. 69 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది నివేదిక. ఒక్కో కంపెనీ సగటున 13,800 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపింది.

రెండో స్థానంలో ఇన్ఫోసిస్​..

అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్న కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 1,00,321 మంది మహిళలని (Women employees in Infosys) నివేదిక వివరించింది. ఆ తర్వాతి స్థానాల్లో విప్రో (72 వేలు) నిలిచింది.

మొత్తం ఉద్యోగుల పరంగా చూస్తే క్యూస్​ కార్ప్​ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థలో మొత్తం 3,63,136 మంది ఉండగా.. అందులో 61,733 మంది మహిళలు కావడం గమనార్హం.

రిలయన్స్ ఇండస్ట్రీస్​లో మొత్తం 2,36,334 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. అందులో మహిళల సంఖ్య 19,561గా (Women employees in Reliance industries) నివేదిక పేర్కొంది.

బ్యాంకింగ్ రంగంలో..

బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్​లో (Women employees in ICICI Bank) అత్యధికంగా 31,059 మహిళా ఉద్యోగులు ఉన్నారు. 21,746 మంది మహిళా ఉద్యోగులతో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రెండో (Women employees in HDFC Bank) స్థానంలో నిలిచింది.

దేశీయంగా టాప్ 500 కంపెనీల్లో మొత్తం 644 మంది మహిళాలు.. ఆయా సంస్థల డైరెక్టర్ల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.

Also read: MedPlus IPO: రేపటి నుంచే మెడ్​ప్లస్ ఐపీఓ- పూర్తి వివరాలు ఇవే..

Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News