ITR E Verification Online: వడ్డీ, డివిడెండ్ ఆదాయంపై థర్డ్ పార్టీ సమాచారం, పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)పై కొన్ని తేడాలను గుర్తించినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఐటీఆర్ దాఖలు చేసిన లావాదేవీ మొత్తం.. ఐటీడీ వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో సరిపోలడం లేదని తెలిపింది. ఈ మేరకు సమస్యను గుర్తించి నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు ఈ అసమతుల్యతను సరిచేయడానికి, తమ ప్రతిస్పందనను అందించడానికి ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in కంప్లయన్స్ పోర్టల్‌లో ఆన్-స్క్రీన్ ఫంక్షనాలిటీ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ప్రస్తుతం 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచార వ్యత్యాసాలను సరి చేసుకోవచ్చని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Raw Onion: ప్రతిరోజూ పచ్చిఉల్లిపాయ తింటే ఈ 10 రోగాలకు దూరంగా ఉండొచ్చు..  


ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే నమోదు చేసుకున్న ట్యాక్స్‌పేయర్లు.. తమ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత నేరుగా పోర్టల్‌కి నావిగేట్ చేయవచ్చు. అక్కడ గుర్తించిన వ్యత్యాసాలు 'ఈ-వైరిఫై' ట్యాబ్ కింద అందుబాటులో ఉంటాయి. అక్కడ చెక్ చేసుకోవచ్చు.


ఇంకా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోని ట్యాక్స్‌పేయర్లు తమ అప్‌డేట్ తెలుసుకోవాలనంటే.. ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోని “రిజిస్టర్” బటన్‌ను క్లిక్ చేసి.. సంబంధిత వివరాలను ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ అయిన తరువాత ఈ-ఫైలింగ్ అకౌంట్‌కు లాగిన్ చేయవచ్చు. మీకు సంబంధించిన తప్పులు ఏమైనా ఉంటే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పని కూడా లేదు. 


ట్యాక్స్‌ పేయర్స్‌తో నిర్మాణాత్మక పద్ధతిలో కమ్యూనికేషన్‌కు ప్రతిస్పందించేందుకు వారికి అవకాశం కల్పించడానికి ఆదాయ పన్ను ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమాచారం నోటీసు కాదని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారు ఐటీఆర్‌లో వడ్డీ ఆదాయాన్ని షెడ్యూల్ OSలో 'Others' అనే లైన్ ఐటమ్ కింద వెల్లడించినట్లయితే.. వడ్డీ ఆదాయానికి సంబంధించిన తేడాలపై స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇది ఆటోమేటిక్‌గా పరిష్కారం అవుతుందని.. ఆ తరువాత పోర్టల్‌లో 'Completed' అని కనిపిస్తుందని తెలిపింది.  


Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి