Akasa Air: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్​ ఝున్​ఝున్​వాలా(Big bull Rakesh JhunJhun wala).. నేతృత్వంలోని 'ఆకాశ' ఎయిర్​లైన్స్​కు సంబంధించి మరో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ.. విమానాల తయారీ సంస్థ బోయింగ్​కు 10 బిలియన్​ డాలర్ల (దాదాపు రూ.75,000 కోట్లు) విలువైన ఆర్డరు ఇవ్వనున్నట్లు (Akasa Boeing deal) సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70-80 737 మ్యాక్స్ విమానాల కోసం ఈ ఆర్ఢరు ఇచ్చినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. బోయింగ్​ ఒప్పందం గురించి 'ఆకాశ' సంస్థ దుబాయ్​ ఎయిర్​షోలో (Dubai airShow) ప్రకటించే అవకాశముందనేది ఈ కథనం సారాశం.


ఈ విషయాలపై రాకేశ్ జున్​జున్ వాలా నుంచి గానీ, ఆకాశ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.


అయితే ఆ వార్తా సంస్థ కథనంలో మాత్రం.. వచ్చే ఏడాది తొలినాళ్లలో కనీసం 10 విమానాలను డెలివరీ చేసేలా ఈ ఒప్పందం కుదిరినట్లు ఉంది. ఆకశ విమానాలు 2022 వేసవిలో కార్యకలాపాలు ప్రారంభించే వీలుందని.. అందుకే అందుకు కావాల్సిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది.


Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ


Also read: Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..


ఆకాశ ఎయిర్​ గురించి..


కరోనాతో దెబ్బతిన్న వ్యాపారాల్లో విమానయాన రంగం కూడా ప్రధానమైంది. దీనితో ఇప్పటికే ఉన్న చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం, నిర్వహణ ఖర్చులకు కోత విధించడం వంటి చర్యలు తీసుకున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య రాకేశ్ ఝున్​ఝున్​వాలా.. విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు.


బడ్జెట్ ధరలో విమానయాన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్థలను నెలకొల్పారు. దీనికి 'ఆకాశ ఎయిర్​లైన్స్' అని పెట్టారు.


Also read: PNB reduces interest rates: పీఎన్​బీ ఖాతాదారులకు షాక్​- సేవింగ్స్ ఖాతాల వడ్డీకి కోత


Also read: Equity Mutual Funds: ఈక్విటీ మార్కెట్‌లో పురోగతి, భారీగా పెట్టుబడులు


రాకేశ్ ఝున్​ఝున్​వాలా ఎమన్నారంటే..


ఈ కొత్త ఎయిర్​లైన్​ ఏర్పాటు చేసిన నాలుగేళ్లలోపే 70 విమానాలను కలిగి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు గతంలో చెప్పారు రాకేశ్ ఝున్​ఝున్​వాలా.


రానున్న రోజుల్లో విమాన ప్రయాణాలు పెరగనున్నాయని.. అయినా తమ సంస్థ  అత్యంత తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించనుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


ఈ సంస్థలో 40 శాతం వాటా రాకేశ్​ ఝున్​ఝున్​ వాలా చేతిలోనే ఉంటుందని సమాచారం.
ఇందులో భాగంగానే ఆకాశ ఎయిర్​ గతనెలలో సివిల్ ఏవియేషన్​ నుంచి అనుమతులు పొందింది. దీనితో ఇక విమానాలను కొనుగోలు చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.


Also read: smoking inside flight: విమానంలో సిగరెట్ తాగిన ఆంధ్ర వ్యక్తి- చైన్నై ఎయిర్​ పోర్ట్​లో అరెస్ట్


Also read: Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook