BSNL Plans: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఉచిత ఓటీటీ సేవలు, అన్‌లిమిటెడ్ కాల్స్
BSNL Plans: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే సంస్థలు చాలా ఉన్నాయి. అందులో మూడు ప్రైవేట్ అయితే ఒకటి మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ. తక్కువ ఖర్చుతో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం పొందాలంటే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్లో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
BSNL Plans: బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కావాలనుకుంటే ఇంతకంటే మంచి ఆప్షన్ మరొకటి ఉండకపోవచ్చు. అత్యంత వేగంగా ఏకంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 1500 జీబీ డేటాతో పాటు ఉచిత ఓటీటీలు కూడా పొందవచ్చు. నమ్మశక్యం కాని ఆఫర్ ఇది. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు 777 రూపాయల ప్లాన్‌ను దేశంలోని చాలా నగరాలకు విస్తరించింది. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆఫర్ ఇప్పుడు చాలా నగరాల్లో అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్, ఫైబర్ టు ది హోమ్ పధకాలివి. మొన్నటివరకూ 100 ఎంబీపీఎస్ వేగంతో 500 జీబీ డేటా లభించేది. ఇప్పుడు 500 జీబీ డేటాను 1500 జీబీకు పెంచింది బీఎస్ఎన్ఎల్. 777 రూపాయల ప్లాన్‌లో లభించే ప్రయోజనాలివి. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉచితంగా ఉంటుంది. 1500 జీబీ డేటా అయిపోతే 5 ఎంబీపీఎస్ వేగంతో డేటా కంటిన్యూ అవుతుంది. అయితే 777 రూపాయల ఈ ప్లాన్‌లో ఉచితంగా ఓటీటీలు లభ్యం కావు. కానీ ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉంటుంది.
100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంకా ఇతర ఆప్షన్లు ఉన్నాయి. వీటితో ఓటీటీ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. ఇవి 799 రూపాయలు, 849 రూపాయల ప్లాన్స్. ఇందులో 799 రూపాయల ప్లాన్ అయితే 1000 జీబీ డేటాతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, యుప్ టీవీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందుతాయి. అదే 849 రూపాయల ప్లాన్‌లో అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు 3.3 టీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో ఓటీటీ సేవలు లభించవు. ఓటీటీలు ఉచితంగా కావాలంటే కేవలం 799 రూపాయల ప్లాన్ ఒక్కటే అందుబాటులో ఉంది. సాధారణంగా బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంటుంది. కానీ ప్రస్తుతానికి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలపై మినహాయింపు ఇచ్చింది.
ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వోడాఫోన్ ఐడియా వంటి సంస్థల కంటే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్‌లో అడ్వాంటేజ్ స్పీడ్. 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉండటం విశేషం.
Also read: Saving Schemes Rules: పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకాల్లో మార్పులు, కొత్త నిబంధనలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook