BSNL Best Fiber Plan: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్ అందిస్తోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలు టారిఫ్ రేట్లు అమాంతంగా పెంచడంతో యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కన్పిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఎస్ఎన్ఎల్ కొత్తగా 1999 రూపాయల ప్రీ పెయిడ్ Fiber ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో 6 నెలలు వ్యాలిడిటీ లభిస్తుంది. దాంతో పాటు 1300 జీబీ డేటా పొందవచ్చు. ఇది హైస్పీడ్ డేటా కావడంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది. స్ట్రీమింగ్, డౌన్‌లోడ్, బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. 1300 జీబీ డేటా వరకూ రోజుకు 25 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. 1300 జీబీ డేటా తరువాత స్పీడ్ తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇది కాకుండా 599 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా ఉంటుంది. 


ఇక బీఎస్ఎన్ఎల్ నుంచి మరో రీఛార్జ్ ప్లాన్ 398 రూపాయలు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటా అందుతాయి. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లబిస్తుంది. 


Also read: PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.