BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్తగా అత్యంత చౌకైన లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్
BSNL New Recharge Plan: ప్రభుత్వ టెలీకం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో ఆఫర్లు ప్రకటిస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, పోటీ తట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఇతర కంపెనీలతో పోలిస్తే చౌకగా ఉండటం గమనార్హం.
BSNL New Recharge Plan: అన్‌లిమిటెడ్ కాలింగ్, హై స్పీడ్ డేటా సహా చాలా ఫీచర్లు ఉంటాయి. అలాంటి మరో అద్భుత ఆఫర్ ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. తక్కువ ధరకే లాంగ్ వ్యాలిడిటీతో మరో ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన కొత్త ప్లాన్ 321 రూపాయలు. ఈ ప్లాన్ ప్రయోజనాలు తెలిస్తే వెంటనే రీఛార్జ్ చేయించుకుంటారు. లాంగ్ వ్యాలిడిటీతో పాటు ఇతర ప్రయోజనాలే అందుకు కారణం. హైస్పీడ్ డేటా ఉండటం వల్ల కస్టమర్లకు మరింత ప్రయోజనం కలగనుంది. నెలకు 250 ఎస్ఎంఎస్‌లు, 15 జీబీ ఉచిత డేటా అందుతాయి. ఈ ప్లాన్‌లో నిమిషానికి 7 పైసలకు లోకల్ కాల్ చేసుకోవచ్చు. ఎస్టీడీ కాలింగ్ నిమిషానికి 15 పైసలు ఛార్జ్ అవుతుంది.
మార్కెట్‌లో ఉండే అన్ని టెలీకం కంపెనీల ప్లాన్స్ కంటే ఇది చాలా చౌక ప్లాన్. ఎందుకంటే 321 రూపాయలు ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోమింగ్, ఇన్‌కమింగ్ వాయిస్ కాల్ ఉచితంగా అందుతాయి. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతానికి తమిళనాడులోని పోలీసులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే సర్కిల్ ఆప్షన్‌లో కేవలం తమిళనాడు మాత్రమే ఉంది. ఇతర రాష్ట్రాలకు ప్రస్తుతానికి ఈ ప్లాన్ లేనట్టే. మార్కెట్‌లో రిలయన్స్ జియో ఎయిర్ టెల్ నుంచి పోటీ తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ ఇటీవల మరోసారి కస్టమర్లపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగానే కస్టమర్లను ఆకట్టుకునే ప్లాన్స్ ప్రకటిస్తోంది.
Also read: IT Refund 2023: రేపు ఆగస్టు 31లోగా ఇ వెరిఫై చేయకపోతే ఆ 31 లక్షలమందికి రిఫండ్ రానట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook