Budget 2022: సగటు ఉద్యోగికి నిరాశే.. ఆదాయపు పన్ను మినహాయింపులపై లభించని ఊరట!
Budget 2022: సగటు ఉద్యోగికి బడ్జెట్ 2022లో నిరాశే ఎదురైంది. తాజాగా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశాలు కనిపించలేదంటున్నారు విశ్లేషకులు.
Budget 2022: భారీ అంచనాల నుడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టారు. వృద్ధికి ఊతమందించే దిశగా పలు కీలక నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఈ సారి బడ్జెట్ అంచనా రూ.39 లక్షల కోట్లుగా వెల్లడించారు. మరి బడ్జెట్‌పై వేతన జీవులు ఏమంటున్నారంటే..
వేనత జీవులకు దక్కని ఊరట..
బడ్జెట్ 2022పై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సారైనా పన్ను మినహాయింపు పెంపు ఉంటుందని భావించినా బడ్జెట్లో అలాంటి ప్రకటన వెలువడలేదు. దీనితో వేతన జీవులు నిరాశ చెందుతున్నారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలోను ఎలాంటి మార్పులపై ప్రకటన చేయలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయపు పన్ను శ్లాబుల్లోనూ పెద్దగా మార్పులు చేయలేదు.
ద్రవ్యోల్బణం పెరుగుతండటం, కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో సాండర్డ్ డిడక్షన్‌ను పెంచేందుకు సుముఖత వ్యక్త చేయలేదు కేంద్రం.
ప్రస్తుతంరూ రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.లక్షకు పెంచుతుందని బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు వేతన జీవులు. మరోవైపు వర్క్ ఫ్రం హోంకు పన్ను లేని అలెవ్సులు ప్రకటించొచ్చని ఆశించారు. వీటిపై బడ్జెట్లో ప్రకటన లేకపోవడం గమనార్హం.
ఐటీ రిటర్నుల విషయంలో మాత్రం స్వల్ప ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి. ఎవరైనా ఐటీఆర్ సమర్పించిన తర్వాత తప్పులు దొర్లినా, తప్పుగా ఫైలింగ్ చేసినా వాటిని సవరించుకునేందుకు రెండేళ్ల వరకు అవకాశం ఉంటుదంని చెప్పారు.
బడ్జెట్ కొన్ని కీలక ప్రకటనలు..
పన్నులు తగ్గింపు వంటి విషయంలో ఊరటనివ్వనప్పటికీ.. సామాన్యులకోసం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది కేంద్రం.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసకం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా కొవిడ్ వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి నాణ్యమైన కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Also read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల
Also read: Budget 2022 Live Updates: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాదిలోనే
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook