Budget 2022 Impacts: బడ్జెట్ 2022 ఏయే రంగాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?
Budget 2022 Impacts: కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022 ఏయే రంగాలకు మేలు చేయనుంది? ఏ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది?
Budget 2022 Impacts: కొవిడ్ పరిస్థితల నడుమే వరుసగా రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగో సారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేశారు.
ఈ సారి బడ్జెట్ ప్రత్యేకతలు..
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నడుస్తున్న సమయంలోనే బడ్జెట్ కూడా రావడం గమనార్హం.
ఇక ఈ సారీ పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. కొవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం ఇందుకు కారణం. అయితే బడ్జెట్ గురించి సామాన్యులకు సైతం సమాచారం అందించేందుకు యూనియన్ బడ్జెట్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో ఆశల, అంచనాల నడుమ వచ్చిన బడ్జెట్ 2022 ఏ రంగంపై ఎలా ప్రభావం చూపనుంది అనే విషయంపై విశ్లేషణలు ఇప్పుడు చూద్దాం.
బ్యాటరీల తయారీదారులకు గుడ్ న్యూస్..
కాలుష్యం లేని రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు.. సరికొత్త ప్రణాళికను ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా ఎలక్టిక్ వాహనాల కోసం కొత్త స్వాపింగ్ విధానాన్న ప్రకటించారు. ఇది బ్యాటరీ తయరీ కంపెనీలకు కలిసొచ్చే అంశం.
ఎక్సైడ్, అమరరాజ బ్యాటరీస్ వంటి సంస్థలకు ఇది గుడ్ న్యూస్ అంటున్నారు విశ్లేషకులు.
మౌలిక సదుపాయాల రంగాలపై ఇలా..
జాతీయ రహదారులను మరింత మరింత విస్తరించడం, గ్రామాలకు రవాణా సదుపాయాలు మరింత మెరుగు పరచడం, 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రకటన ద్వారా.. మౌలిక సదుపాయాలు కల్పించే లార్సెన్ అండ్ ట్యూబ్రో, జీఎంఆర్ సహా వివిధ సంస్థలకు మరిన్ని ప్రాజెక్టులు దక్కే అవకాశముంది.
వందే భారత్ రైళ్ల పెంపు వల్ల కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెట్, ఆల్కార్గో లాజిస్టిక్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ వంటి వాటికి ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు.
లోహ రంగానికి మేలు..
దేశవ్యాప్తంగా 38 లక్షల ఇళ్లకు నీటి సదుపాయం కల్పించేందుకు కేంద్రం 60 వేల కోట్లు కేటాయించింది. పైప్‌లైన్స్ సహా ఇతర లాజిస్టిక్స్ కోసం భారీగా ఖర్చు చేయనుంది. దీని వల్ల లోహాల ఉత్పత్తి సంస్థలైన వేదాంత, టాటా స్టీల్, జిందాల్, కిర్లోస్కర్ బ్రదర్స్ సహా ఈ రంగంలోని ఇత కంపెనీలన్నింటికీ ఆర్డర్లు పెరిగే అవకాశాలున్నాయి.
టెల్కోలు, డేటా సెంటర్లు..
2022-23 ఆర్థిక సంవత్సరంలోనే 5జీ స్పెక్ట్రం వేలం నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని టెల్కోలకు మేలు జరగనుంది.
ముఖ్యంగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు లబ్ధి పొందనున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు..
ప్రపంచంతో పోటీ పడేందుకు సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా డిజిటల్ రూపీని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పరిణామం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి వాటిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.
ఆటోమొబైల్ రంగం..
ఇప్పటికే సెమీ కండక్టర్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంపై కేంద్రం బడ్జెట్లో ఆకర్షణీయమైన ప్రకటన ఏదీ చేయలేదు. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో ఆటోమొబైల్ షేర్లు డీలా పడ్డాయి. మారుతీ సుజూకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీలు ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీకి షాక్..
ముందు నుంచే క్రిప్టో కరెన్సీలపై వ్యతిరేకత చూపుతున్న ప్రభుత్వం బడ్జెట్లో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోకరెన్సీలు, నాన్ పంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ)ల ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం దేశంలో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ సేవలందిస్తున్న కాయిన్ డీసీఎసక్స్, జెబ్‌పే సహా ఇతర సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.
Also read: Budget 2022: ఆశల పద్దు 2022.. బడ్జెట్‌పై వివిధ వర్గాల్లో అంచనాలు ఇవే..
Also read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook