కేంద్ర ఆర్ధిక బడ్జెట్ కొద్దిరోజుల్లోనే రానుంది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలా అంచనాలున్నాయి. 2014 తరువాత ఆదాయపు పన్ను పరిమితిని తిరిగి పెంచకపోవడంతో..ఈసారి పెంచవచ్చనే అంచనాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014 నుంచి ఆదాయపు పన్ను పరిమితి నెలకు 2.5 లక్షల రూపాయలు అలానే ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ 2.0 ప్రభుత్వంలో చివరి సంపూర్ణ బడ్జెట్. అందుకే మధ్య తరగతి ప్రజలకు వరంగా ఉంటుందని ఆశిస్తున్నారు. మధ్య తరగతి ప్రజల్లో చాలామందికి ఈ బడ్జెట్‌లో పెద్దఎత్తున ఉపశమనం కల్గించే అంశాలుండవచ్చని తెలుస్తోంది. 


ఇన్‌కంటాక్స్


వాస్తవానికి 2014 తరువాత 2.5 లక్షల రూపాయల ఇన్‌కంటాక్స్ పరిమితిని పెంచలేదు. 2014లో అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019 నుంచి స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల రూపాయలు చేసేశారు. వేతన జీవులకు ఇన్‌కంటాక్స్ పరిమితిని భారీగా పెంచవచ్చని తెలుస్తోంది.


బడ్జెట్ 2023


మధ్య తరగతి ప్రజల్నించి వస్తున్న ఒత్తిడి గురించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవగాహన ఉందని తెలుస్తోంది. దాంతోపాటు రానున్న బడ్జెట్‌లో కొన్ని వరాలుండవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ తన 5వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దేశ ప్రజలందరి దృష్టి ఈ బడ్జెట్ పైనే ఉంది. 


ట్యాక్స్ స్లాబ్


ఇప్పటివరకూ ఉన్న ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం 60 ఏళ్ల లోబడి ఉన్న వ్యక్తిగత ట్యాక్స్ పేయర్లు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ ఉంది. ఇక 5-10 లక్షల ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ ఉంది. 10 లక్షలపైబడి ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: Flipkart Discount Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఊహించని డిస్కౌంట్ ధరకు యాపిల్ 13



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook