PF Rules: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే..!
EPF Balance Check Online:: ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యగమనిక. మీరు పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేయాలని అనుకుంటున్నారా..? అయితే కాస్త ఆగండి. బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. వాటి గురించి ఒక్కసారి పూర్తిగా తెలుసుకోండి. ఇవిగో వివరాలు..
EPF Balance Check Online: కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాన్-పాన్ కేసుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఉపసంహరణపై టీడీఎస్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నాన్-పాన్ కేసులలో ఈపీఎఫ్ ఉపసంహరణలో పన్ను విధించే భాగంపై టీడీఎస్ రేటును 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. ఈపీఎఫ్ నుంచి ఉపసంహరణపై తీసివేసిన టీడీఎస్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రికార్డులలో పాన్ అప్‌డేట్ చేయని జీతభత్యాల వ్యక్తులకు సహాయం చేస్తుంది.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పాన్ యేతర కేసులలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం నుంచి పన్ను విధించే భాగాల ఉపసంహరణపై టీడీఎస్ రేటు 30 శాతం ఉంటుందని చెప్పారు. ఇతర నాన్-పాన్ కేసుల మాదిరిగానే దీనిని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. మునుపటి సంవత్సరంలో ఇప్పటికే పన్ను చెల్లించనప్పుడు.. కొన్నిసార్లు మునుపటి సంవత్సరం ఆదాయానికి తర్వాత పన్ను తీసివేస్తారు. అటువంటి పన్ను చెల్లింపుదారులు మునుపటి సంవత్సరంలో ఈ టీడీఎస్ కోసం క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా సవరణ ప్రతిపాదించారు.
అధిక టీడీఎస్/టీసీఎస్ రేటు చెల్లించే వ్యక్తి నాన్-ఫైలర్ అయినప్పుడు.. అంటే మునుపటి సంవత్సరం తన ఐటీఆర్‌ని ఫైల్ చేయనప్పుడు.. టీడీఎస్/టీసీఎస్ మొత్తం రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వర్తిస్తుంది. అటువంటి వ్యక్తిని మినహాయించాలని ఇప్పుడు మంత్రి ప్రతిపాదించారు. మునుపటి సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాలను దాఖలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
ఒకసారి ఈపీఎఫ్ ద్వారా టీడీఎస్ తీసివేసిన తర్వాత పన్ను చెల్లింపుదారులకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తుంది ప్రభుత్వం. రీఫండ్‌ను క్లెయిమ్ చేయడానికి ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఈ టీడీఎస్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరణపై ఎటువంటి టీడీఎస్ తీసివేయట్లేదని నిర్ధారించుకోవడానికి ప్రత్యేకంగా ఫారమ్ 15H లేదా ఫారమ్ 15Gని ఈపీఎఫ్ ఖాతాదారులు సమర్పించవచ్చు.
ఫారమ్ 15G 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు వర్తిస్తుంది. ఫారం 15H 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి వర్తిస్తుంది. ఖాతా తెరిచిన 5 సంవత్సరాలలోపు ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ తీసివేస్తారు. ఈపీఎఫ్‌ఓ వద్ద పాన్ కార్డ్ అందుబాటులో ఉన్నట్లయితే.. ఉపసంహరణ మొత్తం రూ.50 వేలు దాటితే టీడీఎస్ తగ్గింపు రేటు 10 శాతంగా ఉంటుంది. అయితే పాన్ కార్డ్ అందుబాటులో లేని లేదా పీఎఫ్ ఖాతాకు లింక్ చేయని ఉపసంహరణల కోసం టీడీఎస్ రేటు 30 శాతంగా ఉంది. తాజాగా అది ఇప్పుడు 20 శాతానికి తగ్గించారు. మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కాస్త ఆగండి. మీ ఖాతా పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే.. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే ఏప్రిల్ 1వ తేదీ వరకు మీరు వేచి ఉండాలి.
Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి
Also Read: India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook