Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!
Ayushman Bharat Budget 2024:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఈ సారి బడ్జెట్ లో గేమ్ చేంజర్ కానుంది.ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భద్రతా పథకంగా పేరొందిన ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత అందిస్తోంది.సుమారు 5 లక్షల రూపాయల వరకు విలువైన వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పొందవచ్చు.ఈ పథకం 2018 నుంచే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలులోకి వచ్చింది.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకం కింద 5 లక్షల రూపాయలు ఉన్న లిమిట్ ను 10 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి జోరుగా చర్చ కూడా కొనసాగుతోంది.
కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎన్నికల తరువాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వీలుంది.ఎన్నికల హామీలను దృష్టిలో ఉంచుకొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొని దీని లిమిట్ ను 10 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ పథకం గడిచిన 5 సంవత్సరాల్లో అంచనాలను పెంచుతూ ముందుకు సాగుతోంది.వచ్చే మూడేళ్లలో లబ్ధిదారుల సంఖ్యను కనీసం రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.తద్వారా ఆయుష్మాన్ భారత్ స్కీం లోకి సుమారు 12 కోట్ల కుటుంబాలకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా వేస్తున్నారు.
2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ పథకాల్లో మొదట ఐదు లక్షల పరిమితిని విధించారు.అయితే ప్రస్తుతం పెరిగిన వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.10 లక్షలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు నీతి ఆయోగ్ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత దేశంలోని సుమారు 30 శాతం మంది ప్రజలు ఆరోగ్య భీమాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ మధ్యతరగతి ప్రజలకు ఒక వరంగా మారే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా పేద ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.అయితే ఈ లిమిట్ ను పది లక్షలకు పెంచినట్లయితే కేంద్ర ఖజానాపై 12 వేల కోట్ల రూపాయల భారం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.నిజానికి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించే ఉద్దేశాన్ని ప్రకటించింది.ఈ పథకాన్ని 12 కోట్ల కుటుంబాలకు చేర్చుతామని కూడా తెలిపింది. ఎందుకు సంబంధించి కేటాయింపులను సైతం రూ.7 వేల కోట్లకు పెంచింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల రూపాయల లిమిట్ రూ.10 లక్షల రూపాయలకు సైతం పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : HAL Stock:రూ.1లక్ష కోట్ల ఆర్డర్ బుక్ దిశగా HAL..ఇన్వెస్టర్ల పాలిట బంగారు బాతుగా మారిన ప్రభుత్వ రంగ సంస్థ.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి