Business Laws And Clauses: దేశంలో పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలను ఏర్పాటు చేసే మార్గం సుగుమం చేసేందుకు ప్రభుత్వాలు నిబంధనలను సడలిస్తూ పోతున్నాయి. వ్యాపార నిర్వహణ సులభతరమై, కొత్త కొత్త పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగాన్ని పారదోలి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిబంధనలను సవరిస్తూ బడా బడా వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తూ వస్తున్నాయి. తద్వారా వ్యాపారవేత్తలకు తమ పరిశ్రమల ఏర్పాటును, వ్యాపారాన్ని విస్తరించేందుకు సహకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అంతటి కఠినమైన వ్యాపార చట్టాలు, కార్మిక చట్టాలు ఇప్పుడు లేవు. కాలక్రమంలో అవి సంఖ్యాపరంగా తగ్గుతూ వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం ప్రభుత్వాలు వ్యాపార చట్టాలను సడలిస్తూ పోతుండటంతో ఒకప్పటితో పోల్చుకుంటే, కార్పొరేట్ సంస్థలకు ఇప్పుడు చాలావరకు ఇబ్బందులు తొలగిపోయాయి. అయినప్పటికీ, వ్యాపార చట్టాలను అతిక్రమించే వ్యాపారవేత్తలకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే నేరాల తీవ్రతనుబట్టి వారిని జైలుకి పంపేందుకు సైతం వెనుకాడని విధంగా ఇంకా 26,134 క్లాజెస్ ఉన్నాయి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 


అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థతో టీమ్‌లీజ్ రెగ్‌టెక్ అనే సంస్థ రూపొందించిన అధ్యయనం తాలుకా నివేదికల ప్రకారం, వ్యాపారం చేసే వ్యాపారవేత్తలకు విధించిన ఐదు నిబంధనలలో ఏదైనా రెండింటిని పాటించకపోయినట్టయితే.. సదరు వ్యాపారవేత్తలకు జైలు శిక్ష విధించే విధంగా మన దేశంలో వ్యాపార చట్టాలు ఉన్నాయి. 


ఇండియాలో వ్యాపారం చేయడంలో నియమనిబంధనలు పాటిస్తూ వ్యాపారవేత్తలు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా వారిని నియంత్రించేందుకు మన బిజినెస్ చట్టాల్లో 69,233 వరకు స్పెషల్ క్లాజెస్ ఉన్నాయి. అందులో 26,134 కఠినమైన అనుకరణలు ఉన్నాయి. అవి ఎంత కఠినమైన క్లాజెస్ అంటే.. ఎవరైనా వ్యాపారవేత్తలు వ్యాపారం పేరిట ఆ నియమనిబంధనలను అతిక్రమిస్తే.. వారిని జైలు గోడల మధ్యకు పంపించేంత శక్తివంతమైన క్లాజెస్ అవి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యాపారవేత్త ఐదు నిబంధనల్లో రెండింటిని అతిక్రమించారంటే... చట్టం ప్రకారం వారు జైలుకు వెళ్లక తప్పదన్నమాట. 


మరీ ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) విషయంలో ఈ నిబంధనలు అతి కఠినంగా ఉండటం ఆ పరిధిలోకి వచ్చే సంస్థలకు ఆందోళన కలిగించే విషయంగా తాజా అధ్యయనం పేర్కొంది. 150 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల 500 నుంచి 900 వరకు నిబంధనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Multibagger Stocks: రూ. 65 నుంచి రూ. 560 కి పెరిగిన స్టాక్ ధర 


కఠినమైన ఈ నిబంధనల వల్ల కేవలం లాభాపేక్ష కోసమే వ్యాపారం చేస్తోన్న వ్యాపారవేత్తలకే కాకుండా, లాభాపేక్షతో సంబంధం లేకుండా నడిచే సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి వాటిని సృష్టించే వ్యాపారవేత్తలతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది అనే విషయంలో అంతరం పెరుగుతోంది.


ఇది కూడా చదవండి : Best Smartphones Under @ 20000: రూ. 20 వేల లోపు బెస్ట్ కెమెరా ఫీచర్స్ ఉన్న ఫోన్స్ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK