iPhone 13 Price Drops: రూ.74,900 విలువైన ఐఫోన్ 13ను రూ.52,305కే కొనండిలా!
iPhone 13 Price Drops: యాపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ విలువతో కలిపి రూ.22 వేలకుపైగా తగ్గింపు ఇస్తోంది. ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 13 Price Drops: చాలా మందికి ఐఫోన్ కొనాలనేది ఓ డ్రీమ్‌గా ఉంటుంది. ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది దానిని కొనే ఆలోచిస్తుంటారు. ఆఫర్లు, భారీ డిస్కౌంట్ ఇస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోరు.
అలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లలో మీరూ ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఐఫోన్లపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరే ఆఫర్ ప్రకటిచింది.
యాపిల్ 13 ఒరిజినల్ ధర రూ.74.900గా ఉండగా.. స్పెషల్ ఆఫర్ కింద రూ.56,050కే పొందే అవకాశముందని తెలిపింది.
ఆఫర్ వివరాలు ఇలా..
ఐఫోన్ 13 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై ఈ ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. నిజానికి ఈ ఫోన్ ధర రూ.79,900 ఉండగా.. 6 శాతం తగ్గింపుతో.. రూ.74,900లకు విక్రయిస్తోంది.
బ్యాంక్ ఆఫర్..
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాండ్ డెబిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌కు చెల్లింపులు జరిపితే.. అదనంగా మరో 5 శాతం (రూ.3,745) డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ కూడా కలిపితే ఫోన్ ధర రూ.71,155కు తగ్గుతుంది.
ఎక్స్ఛేంజి ఆఫర్..
ఇక పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరో రూ.18,850 వరకు తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఉంది. ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ కండీషన్‌ను బట్టి ఎక్స్ఛేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ పూర్తి ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తే.. ఫోన్ ధర రూ.52,305కు తగ్గుతుంది (రూ.71,155-రూ.18,850).
ఫోన్ ఫీచర్లు..
6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే
128 జీబీ స్టోరేజ్
5జీ వేరియంట్
ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్
వెనుకవైపు రెండు కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
12 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
డ్యూయల్ సిమ్ (ఒకటి నానో సిమ్, రెండోవది ఈ-సిమ్)
ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్
Also read: Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook