BYD Seal EV Price: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు 650 కిలోమీటర్లు పక్కా.. సరికొత్త EV కారు, ధర ఎంతంటే..?
ఎలక్టికల్ కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఒకసారి సీల్ (BYD Seal EV) ను పరీక్షించండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లు వరకు తిరోగొచ్చంట. థాయ్‌లాండ్ లో లాంఛ్ అయిన ఈ కారు ఇండియాలో కూడా రానుంది.
BYD Seal EV Price: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీరు ఇప్పుడు చెప్పబోయే కారు గురించి మీరు పరిశీలించవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న చైనాకు చెందిన ప్రముఖ సంస్థ బీవైడీ (BYD) నుంచి ఓ కొత్త ఈవీ (Electric Vehicle) కారు లాంఛ్ అయ్యింది. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారు పేరును సీల్ (BYD Seal EV)గా నామకరణం చేశారు. అయితే ఈ కారును తొలుత థాయ్‌లాండ్ లో లాంఛ్ చేశారు. అతి త్వరలోనే ఇండియాలో ఈ కారును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈవీ కారు ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? అని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేరియంట్ రకాలు..
అయితే BYD కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మొత్తం మూడు వేరియంట్స్ ను విడుదల చేసింది. డైనమిక్ వేరియంట్ 61.4 Kwh, LFP బ్లేడ్ బ్యాటరీల పెయిర్ ను కలిగి ఉంది. 204 HP పవర్ ను కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ కారు పరుగెడుతుంది. ఈ వేరియంట్ కారును ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 510 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.
ఈ కారులోని మరో వేరియంట్ లో 82.5 KWH, LFP బ్లేడ్ బ్యాటరీల పెయిర్ ను కలిగి ఉంది. 313 HP పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ తో పరిగెత్తుతుంది. అయితే ఈ వేరియంట్ కారును ఒకసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్లకు ప్రయాణం చేయగలదు.
Also Read: Health Care: పాదాలు, అరికాళ్లు మండుతుంటే...రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు
ధర ఎంతంటే..?
చైనాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ BYD లోని సీల్ ఎలెక్ట్రిక్ కారు అతి త్వరలోనే భారతదేశంలోనూ విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే థాయ్ లాండ్ లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ కారు భారతీయ కరెన్సీ ప్రకారం.. చాలా ఖరీదు అవుతోందని తెలుస్తోంది. భారత రూపాయి వాల్యూ ప్రకారం BYD సీల్ కారు ధర రూ. 29.8 లక్షలుగా ఉంది. ఈ కారుకు పోటీగా భారత మార్కెట్లో ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా MG ZS ప్రో డీటీ కారు ధరకు ఇది సమానంగా ఉండనుంది. MG ZS ప్రో డీటీ కారు ధర ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 29.6 లక్షలుగా ఉంటుంది.
అయితే భారత మార్కెట్లో రానురానూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే దిశగా దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు వినియోగదారుల అవసరానికి అనుగుణంగా పలు వేరియంట్స్ ను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన TATA, MG సహా అనేక బ్రాండ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు.
Also Read: Onion Tea For Bad Cholesterol: అతి తక్కువ రోజుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook