Onion Tea For Bad Cholesterol: అనారోగ్యకరమైన ఆహారాలను క్రమంగా తినడం వల్ల చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పేరుకుపోతోంది. చాలామందిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా కూర్చోవడం, వ్యాయామాలు చేయకపోవడం, శరీరక శ్రమ లేకపోవడం కారణంగా కూడా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందిలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెపోటు వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు అదుపులో ఉంచుకోవడానికి తప్పకుండా మంచి జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. దీంతోపాటు తీసుకుని ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కొన్ని పానీయాలను తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజు ఉల్లితో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఉల్లిపాయలతో తయారుచేసిన టీని తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ ను కూడా సులభంగా కలిగిస్తాయి. కాబట్టి అధిక బరువు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
ఉల్లిపాయ టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా.. రెండు ఉల్లిపాయలను కట్ చేసి బౌల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టౌ పై మరో బౌల్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీటిని పోసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిని అందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత రెండు చెంచాల సోంపును కూడా అదే బౌల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా 20 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత వడకట్టుకొని రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి