Health Care: మనిషి శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైంది, కీలకమైంది రోగ నిరోధక శక్తి. ఇది బలంగా ఉన్నంతవరకూ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. కరోనా మహమ్మారి సమయంలో ఇమ్యూనిటీ విలువేంటో అందరికీ తెలిసింది.
రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ సమస్య ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో శరీరానికి సాధారణ వ్యాయామం లేదా కొన్ని రకాల యాంటీ బయోటిక్స అవసరమౌతాయి. ఇవి లేకపోతే పాదాల్లో మంట, నొప్పి ఉంటుంది. ఇటీవలి కాలంలో అథ్లెట్ ఫుట్ సమస్య తరచూ కన్పిస్తోంది. ఇమ్యూనిటీ క్షీణించడమే ఈ సమస్యకు కారణం. పాదాల్లో మంట, అరికాళ్లలో నొప్పి ఉంటే శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు నీళ్లు తగినంతగా తాగాలి.
బయటి తిండి తరచూ తింటుంటే కడుపు సంబంధిత వ్యాధులు ఉత్పన్నమౌతాయి. వాతావరణంలో వేడి, కడుపులో వేడి కారణంగా పాదాల్లో మంట, నొప్పి ఉంటాయి. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు సోంపు, పింక్ సాల్ట్ పానీయం ఒంటికి చాలా మంచిది. పాదాల్ని చల్లగా ఉంచడంలో దోహదం చేస్తుంది.
పటిక బెల్లంను నీళ్లలో కరిగింంచుకుని తాగితే చలవ చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. రోజూ ఉదయం వేళ పరగడుపున సోంపు, రాక్ సాల్ట్ వాటర్ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి వెలుగును కూడా మెరుగుపరుస్తుంది. ఇక నిద్ర కూడా హగాయిగా పడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook