Car Loan Tips: కారు కొనేటప్పుడు ఆవేశంగా బ్యాంకు లేదా ఏదైనా ఫైనాన్సర్ ద్వారా కొనేస్తుంటారు. కానీ నెల నెలా కారు ఈఎంఐ కట్టేడప్పుడు ప్రాణం మీదికి వస్తుంటుంది. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఈఎంఐ సులభంగా చెల్లించే పద్ధతులున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో ఏ కారు చూసినా 4-5 లక్షల మధ్య ఉంటుంది. అందుకే చాలామంది అంటే అత్యధికులు బ్యాంకు లోన్‌తో కార్లు కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా కారు రుణం ఓ భారంగా మారిపోతుంటుంది. ఈ పరిస్థితి  నుంచి బయటపడేందుకు కారు ఈఎంఐ సులభంగా సాగేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అప్పుడే కారు రుణం ఈఎంఐ ఎప్పటికీ భర్తీ కాదు. 


కారు లోన్ తీసుకునేటప్పుడు ఈఎంఐ తగ్గించేందుకు ఎక్కువ డౌన్ పేమెంట్ చేయాలి. ఇలా చేయడం వల్ల నెలసరి బడ్జెట్‌పై పెద్దగా ప్రభావం పడదు. తీసుకునే రుణం కాల పరిమితి సైతం తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైనాన్సియర్ల నియమ నిబంధనల ప్రకారం మీ జీతంలో కనీసం 20 శాతం డౌన్ పేమెంట్ కట్టాలి. లోను పరిమితి 4 ఏళ్లు ఉంటే లేదా అంతకంటే తక్కువ ఉంటే వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. అంతకంటే మించకూడదు. ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కారు లోన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. 


ఒకవేళ మీరు వేతన ఉద్యోగి అయితే మీరు ఈఎంఐతో పాటు అడ్వాన్స్ డబ్బులు ఎంత అనేది నిర్ణయించుకోవాలి. ప్రతి ఈఎంఐతో పాటు 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏడాదికి 12 వేలు చెల్లిస్తారు. ఇలా చేయడం వల్ల మీరు తీసుకున్న రుణాన్ని త్వరగా చెల్లించేందుకు వీలవుతుంది. అదే సమయంలో వడ్డీ కూడా తగ్గుతుంది.


కారు ఎప్పుడు కొనుగోలు చేసినా మీ బడ్జెట్‌కు లోబడే కొనాల్సి ఉంటుంది. మీ బడ్జెట్ ఎంతో చూసుకుని అందుకు అనుగుణంగా కారుని ఎంచుకోవాలి. లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేకాకుండా రాను రాను లోను కట్టలేని పరిస్థితి కూడా రావచ్చు. 


Also read: Best CNG Car: మారుతి ఆల్టో, వేగన్ ఆర్ కంటే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే, ధర కూడా తక్కువే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook