Best CNG Car: మారుతి ఆల్టో, వేగన్ ఆర్ కంటే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే, ధర కూడా తక్కువే

Best CNG Car: మారుతి సుజుకి కార్లంటే దేశ ప్రజలకు క్రేజ్ ఎక్కువ. ఇప్పటికే మార్కెట్ లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం మనం చర్చిచేంది మారుతి సుజుకి కంపెనీకు చెందిన సిలేరియో గురించి, మైలేజ్ , ధర వివరాలు తెలుసుకుందా.ం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2023, 03:12 AM IST
Best CNG Car: మారుతి ఆల్టో, వేగన్ ఆర్ కంటే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే, ధర కూడా తక్కువే

Best CNG Car: మారుతి సుజుకికు చెందిన వేగన్ ఆర్, ఆల్టో, ఎర్టిగా కార్ల కంటే ఎక్కువగా విక్రయమౌతున్న మరో మోడల్ కారు ఉంది. ఇది మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుంది. సీఎన్జీ కార్ల పరిశ్రమే ఇక్కడున్నట్టుగా అన్పిస్తుంది. తక్కువ ధర ఎక్కువ మైలేజ్ అనేది ఈ కారు ప్రత్యేకత.

మారుతి సుజుకి కంపెనీ వద్ద సీఎన్జీ కార్ల వివరాలున్నాయి. ఇందులో హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎంపీవీ వంటి మోడల్ కార్లు చాలానే ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీకు చెందిన మారుతి ఆల్టో నుంచి మొదలుకుని వేగన్ ఆర్, స్విఫ్ట్, మారుతి గ్రాండ్ విటారా వరకూ అన్నింటిలోనూ కంపెనీ నుంచి సీఎన్జీ ఆప్షన్ ఉంది. వీటిలో మారుతి సిలేరియో టాప్ స్థానంలో ఉంది. వేగన్ ఆర్, ఆల్టో, ఎర్టిగా కార్లు మారుతి సుజుకి కంపెనీ కార్లలో అత్యధికంగా సేల్ అయ్యేవి. ఇప్పుడా పరస్థితి లేదు. మారుతి సుజుకి సిలేరియా మొదటి స్థానాన్ని ఆక్రమించి ఉంది. ఒకవేళ మీరు సీఎన్జీ వెర్షన్ కొనే ఆలోచన ఉంటే మారుతి స్విఫ్ట ్కారు. ఇది కారు మంచిది కాదు. మారుతి సుజుకి సీఎన్జీ వెర్షన్ కార్లలో సిలేరియో, వేగన్ ఆర్, ఆల్టో, ఎస్ ప్రెసో వంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి సిలేరియో సీఎన్జీ వెర్షన్ గత ఏడాదే ప్రారంభమైంది.  మారుతి సిలేరియో మైలైజ్ 35.60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇక మారుతి వేగన్ ఆర్ సీఎన్జీ వేరియంట్ 32.52 కిలోమీటర్ల మేలేజ్ ఇస్తుంది. అదే మారుతి ఆల్టో అయితే 31.59 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఎస్ ప్రెసో 31.2 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్థూలంగా చెప్పాలంటే మిగిలిన మారుతి సుజుకి సీఎన్జీ కార్లతో పోలిస్తే ఇదెక్కువ మైలేజ్ ఇస్తుంది.

మారుతి సుజుకి సిలేరియో ధర ఇండియాలో 5.37 లక్షల్నించి ప్రారంభమౌతుంది. ఇది పెట్రోల్ వేరియంట్ ధర. సిలేరియో సీఎన్జీ వేరియంట్ ధర 6.74 లక్షల రూపాయలుంది. ఇందులోనే టాప్ వేరియంట్ అయితే 7.14 లక్షల రూపాయలుంది. ఇక మారుతి సుజుకి సిలేరియో పెట్రోల్ వెర్షన్ కూడా మైలేజ్ ఎక్కువగా ఉంది. 

Also read: IRCTC Retiring Room: 100 రూపాయలకే లగ్జరీ రూమ్.. ఎలా బుక్ చేసుకోవాంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News