PPF Deadline: పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, మార్చ్ 31లోగా పూర్తి చేయకపోతే ఎక్కౌంట్లు క్లోజ్
PPF Deadline: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టినవారికి ముఖ్య గమనిక. మార్చ్ 31లోగా అంటే మరో 40 రోజుల్లోగా ఈ పని పూర్తి చేయకుంటే మీ ఎక్కౌంట్ ఫ్రీజ్ కాగలవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPF Deadline: భవిష్యత్ సంరక్షణకై చాలామంది పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చ్ 31 లోగా కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే ఆ ఎక్కౌంట్లన్నీ నిర్వీర్యం కాగలవు.
కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన, ఎన్ పీఎస్, పీపీఎఫ్ ఎక్కౌంట్లకు సంబంధించి కీలకమైన అప్ డేట్ జారీ చేసింది. ఈ ఎక్కొంట్లు మీక్కూడా ఉండి ఉంటే మార్చ్ 31లోగా కనీస మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్కౌంట్ ఓపెన్ చేసి కనీస మొత్తం డిపాజిట్ లేకుండా వదిలేస్తుంటారు. ఈ ఎక్కౌంట్లు యాక్టివ్ గా ఉండాలంటే ప్రతి ఆర్ధిక సంవత్సరంలో ఎంతో కొంత కనీస మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే సంబంధిత ఎక్కౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి. ఈ ఆర్ధిక సంవత్సరానికి చివరి తేదీ మార్చ్ 31గా ఉంది. అప్పటిలోగా మినిమమ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు ఇన్ కంటాక్స్ కు సంబంధించి కీలక ప్రకటన ఉంది. కొత్త ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు కొన్ని మార్పులు చేసింది. కొత్త ట్యాక్స్ విధానం ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి కనీస మినహాయింపు 2.5 లక్షల నుంచి 3 లక్షలైంది. ఇక కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఆదాయముంటే ట్యాక్స్ జీరోగా ఉంటుది. అందుకే ట్యాక్స్ సేవ్ చేయాలనుకుంటే మార్చ్ 31లోగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి ప్లాన్. ఇందులో కనీసం 500 రూపాయలు గిరష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. పీపీఎఫ్ లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్లు . అంటే అప్పటివరకూ ఇందులోంచి డబ్పులు విత్ డ్రా చేయలేరు.
సుకన్య సమృద్ధి యోజన అనేది మీ అమ్మాయిల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంరక్షణ స్కీమ్. మీ ఇంట్లో ఆడపిల్ల ఆర్ధిక సంరక్షమ, చదువుల నిమిత్తం ప్రారంభించిన పధకమిది. అందుకే అత్యధికంగా 8.2 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో 14 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అమ్మాయికి 21 ఏళ్లు నిండాకే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈ ఎక్కౌంట్లు క్లోజ్ కాకుండా ఉండాలంటే ఏడాదికి చేయాల్సిన కనీస డిపాజిట్ మార్చ్ 31వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎక్కౌంట్లు క్లోజ్ కావడం, తిరిగి ఓపెన్ చేసేందుకు ఇబ్బందులు పడటం ఉంటుంది. అదే సమయంలో ట్యాక్స్ సేవింగ్స్ కోసం కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ మార్చ్ 31లోగా చేసుకోవచ్చు.
Also read: Airtel Best Plan: ఎయిర్‌టెల్ నుంచి చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్, రోజుకు 5 రూపాయలే ఖర్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook