Toll Tax: 12 గంటల్లోగా తిరిగొచ్చేస్తే..టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు, వైరల్ అవుతున్న మెస్సేజ్
Toll Tax: టోల్‌గేట్ ట్యాక్స్ విషయంలో వివిధ రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 12 గంటల్లోగా తిరిగొస్తే టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ మరో వార్త వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Toll Tax: టోల్‌గేట్ ట్యాక్స్ విషయంలో వివిధ రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 12 గంటల్లోగా తిరిగొస్తే టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ మరో వార్త వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగినప్పటి నుంచి ఏది నిజమో ఏది కాదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ఫేక్ వార్తలే వైరల్ అవుతుంటాయి. చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తల్ని నిజమని నమ్మేసిన పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. 12 గంటల్లోగా ప్రయాణం ముగించుకుని అదే టోల్‌గేట్ నుంచి తిరిగొస్తుంటే టోల్‌ట్యాక్స్ అవసరం లేదనేది ఆ వార్త సారాంశం. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్ఫష్టత ఇచ్చింది.
మెస్సేజ్‌లో ఏముంది
ఒకవేళ మీరు టోల్‌ప్లాజా వద్ద డబ్బులు కట్టేటప్పుడు ఒకవైపా లేదా రెండు వైపులా అనడిగినప్పుడు 12 గంటలని చెబితే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సేజ్‌లో ఉంది. అంతేకాకుండా కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ పేరుతో పాటు భారత ప్రభుత్వం జారీ చేసినట్టుగా ఉంది. ఫలితంగా అందరూ ఈ మెస్సేజ్ నిజమని నమ్మేశారు. అందరికీ ఫార్వర్డ్ చేయడం మొదలెట్టారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించింది.
ఈ తరహా మెస్సేజ్‌లు లేదా ప్రకటనలు ప్రభుత్వం జారీ చేయలేదని..ఇదంతా ఫేక్ అని నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ తరహా మెస్సేజ్‌లు సోషల్ మీడియాలో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఈ తరహా మెస్సేజ్‌లు మీక్కూడా వస్తే ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. ఫేక్ వార్తలు, మెస్సేజ్‌ల పట్ల అప్రమత్తత అవసరం.
Also read: Adani Group Open Offer: ఏసీసీ, అంబుజాకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook