DA Hike: ఉద్యోగులకు శుభవార్త, డీఏతో పాటు హెచ్ఆర్ఏ కూడా భారీగా పెంపు
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డబుల్ బొనాంజా ఆఫర్ లభించనుంది. మార్చ్ నెలలో డీఏతో పాటు హెచ్ఆర్ఏ సైతం పెరగనుంది. ఫలితంగా జీతంలో భారీ పెరుగుదల కన్పించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 46 శాతం డీఏ అందుతోంది. జనవరి 2024 నుంచి పెరగాల్సిన 4 శాతం డీఏ పెరిగితే డీఏ కాస్తా 50 శాతానికి చేరుకోనుంది. అంటే మార్చ్ నెల నుంచి దేశవ్యాప్తంగా 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం డీఏను మార్చ్ నెల నుంచి పెంచనుంది. అంటే ఏప్రిల్ 2024 నుంచి ఉద్యోగులు,పెన్షనర్లకు 50 శాతం డీఏ లభించనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం హెచ్ఆర్ఏ సైతం పెరగనుంది. మార్చ్ నెలలో డీఏ 4 శాతం పెరగనుంది. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం జనవరి, జూలై నెలల్లో డీఏ పెరగనుంది. జనవరి 2024 నుంచి డీఏ పెరగాల్సి ఉంది. తిరిగి జూలైలో పెరగవచ్చు. అయితే జనవరి నుంచి ఎరియర్లతో సహా లభిస్తుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 46 శాతం డీఏ లభిస్తోంది. జనవరి నుంచి మరో 4 శాతం పెరిగితే మొత్తం డీఏ 50 శాతమౌతుంది. మార్చ్ నెలలో కేంద్ర మంత్రిమండలి డీఏ పెంపుకు ఆమోదముద్ర వేయవచ్చు. అంటే ఏప్రిల్ నుంచి జీతంలో పెరుగుదల కన్పిస్తుంది. డీఏ 50 శాతానికి చేరుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా 48 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లకు లాభం కలగనుంది. జీతం కూడా పెరుగుతుంది. అంటే కనీస వేతనం 18 వేలుంటే 50 శాతం డీఏ చొప్పున 9 వేల రూపాయలు జీతం ఒకేసారి పెరుగుతుంది. ఎందుకంటే డీఏ 50 శాతం చేరినప్పుడు ఆ మొత్తాన్ని కనీస వేతనంలో కలుపుతారు.
ఇక హెచ్ఆర్ఏ కూడా 3 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న 27 శాతం హెచ్ఆర్ఏకు 3 శాతం పెరిగితే 30 శాతం కానుంది.
Also read: AP Rajyasabha Elections 2024: తొలిసారి పెద్దల సభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook